ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rachakonda Police: 10 రోజులు.. వందల ఫుటేజీలు.. 900 కి.మీ

ABN, Publish Date - Aug 11 , 2024 | 10:14 AM

ట్రావెల్‌ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులే లక్ష్యంగా నిమిషాల్లో కోట్లాది రూపాయలను కొల్లగొట్టే థార్‌గ్యాంగ్‌ను రాచకొండ పోలీసులు(Rachakonda Police) ఎట్టకేలకు కటకటాల్లోకి నెట్టారు.

- ఎట్టకేలకు థార్‌గ్యాంగ్‌ను పట్టుకున్న రాచకొండ పోలీసులు

హైదరాబాద్‌ సిటీ: ట్రావెల్‌ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులే లక్ష్యంగా నిమిషాల్లో కోట్లాది రూపాయలను కొల్లగొట్టే థార్‌గ్యాంగ్‌ను రాచకొండ పోలీసులు(Rachakonda Police) ఎట్టకేలకు కటకటాల్లోకి నెట్టారు. ఇటీవల ముంబై నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళుతున్న ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు చౌటుప్పల్‌ సమీపంలో భోజనం కోసం నిలపగా.. దోపిడీ దొంగలు బస్సులోకి చొరబడి రూ. 1.50కోట్ల విలువైన 2.1 కిలోల బంగారాన్ని దోచుకెళ్లిన విషయం తెలిసిందే.

ఇదికూడా చదవండి: Union Minister: ఆదివాసీలు వైదిక ధర్మంలో భాగం..


రాచకొండ సీపీ సుధీర్‌బాబు(Rachakonda CP Sudhir Babu) ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు పదిరోజులు శ్రమించి.. దొంగల ముఠాను పట్టుకొని, రూ. 1.26కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎంతో ప్రమాదకరమైన థార్‌ దోపిడీ గ్యాంగ్‌ను పట్టుకునే క్రమంలో పోలీసులు పదిరోజుల పాటు పడరాని పాట్లు పడ్డారు. కంటిమీద కునుకులేకుండా, కడుపు నిండా తిండిలేకుండా ఎంతో శ్రమకోర్చి ఎట్టకేలకు థార్‌ గ్యాంగ్‌ ఆటకట్టించారు.


900 కి.మీ.. వందల సీసీటీవీల పరిశీలన

జూలై 27న ఉదయం 9:30కు దోపిడీ జరిగితే సాయంత్రం 4 గంటలకు పోలీసులకు ఫిర్యాదు అందింది. అప్పటికే దోపిడీ దొంగలు చౌటుప్పల్‌ నుంచి హైదరాబాద్‌ దాటేసి మహారాష్ట్ర మీదుగా మధ్యప్రదేశ్‌(Madhya Pradesh) వైపు వెళ్లారు. సీపీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు దోపిడీ జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి ఇది మధ్యప్రదేశ్‌కు చెందిన థార్‌గ్యాంగ్‌ పనిగా నిర్ధారణకు వచ్చారు. దాంతో చౌటుప్పల్‌(Chautauqua) నుంచి ప్రారంభమైన పోలీసుల వేట మధ్యప్రదేశ్‌ భోపాల్‌ వరకు కొనసాగింది. సుమారు 900 కిలోమీటర్లు, దూరంలో ఉన్న దొంగలను చేరుకోవడానికి పోలీసులు మార్గమధ్యలో వందలాది సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను జల్లెడ పట్టి, ఒక్కో సాంకేతిక ఆధారాన్ని సంపాదించుకుంటూ ముందుకు వెళ్లినట్లు పోలీసులు బృందాలు వెల్లడించాయి.


టోల్‌గేట్ల వద్దే స్నానాలు.. రోడ్డుపక్కనే నిద్ర

ఆలస్యం చేస్తే దొంగలు దొరకరు అని భావించిన రాచకొండ పోలీసులు.. సంకల్పాన్ని సడలకుండా, వారిని పట్టుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగారు. సాంకేతిక ఆధారాలను సేకరించే క్రమంలో కంటిమీద కునుకులేకుండా, కడుపు నిండా తిండిలేకుండా వర్కవుట్‌ చేశారు. కారులోనే నిద్రపోతూ టోల్‌గేట్ల వద్ద స్నానాలు చేస్తూ తమ వేటను కొనసాగించారు. ఇలా సుమారు పది రోజుల పాటు, రాత్రిపగలూ కష్టపడ్డారు.


అయితే, దొంగలు మార్గమధ్యలో కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌(Karnataka, Maharashtra, Madhya Pradesh) రాష్ట్రాలకు చెందిన నకిలీ నంబర్‌ ప్లేట్లు మార్చుకుంటూ ప్రయాణించినట్లు గుర్తించారు. పోలీసులను దారిమళ్లించడానికి టోల్‌గేట్లను తప్పించుకుంటూ కొన్ని కిలోమీటర్లు అడ్డదారిలో వెళ్తూ హైవేలు ఎక్కి భోపాల్‌ను చేరుకున్నట్లు గుర్తించారు. అనంతరం అక్కడ మకాం వేసిన పోలీసులు ఎట్టకేలకు థార్‌ గ్యాంగ్‌లో ప్రధాన నిందితున్ని పట్టుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకొని 1.832 కేజీల బంగారాన్ని రికవరీ చేశారు. దోపిడీ దొంగల భరతం పట్టడమే లక్ష్యంగా పట్టుదలతో.. 900 కిలోమీటర్లు ప్రయాణించి థార్‌గ్యాంగ్‌ను పట్టుకున్న చౌటుప్పల్‌ పోలీస్‌, ప్రత్యేక బృందాలను రాచకొండ సీపీ అభినందించి, రివార్డులు అందజేశారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Offensive Video: బిత్తిరి సత్తిపై సైబర్‌ క్రైంలో కేసు నమోదు..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 11 , 2024 | 10:19 AM

Advertising
Advertising
<