ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Secunderabad: బీదర్‌, పద్మావతి రైలులో దొంగలు పడ్డారు...

ABN, Publish Date - Jun 14 , 2024 | 01:01 PM

బీదర్‌, పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ రైల్లో(By Bidar, Padmavati Express train) దొంగలు పడ్డారు. విజయవాడ నుంచి సికింద్రాబాద్‌(Vijayawada to Secunderabad) వైపు వస్తున్న పద్మావతి, బీదర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఎస్‌- 4,9,10 బోగిలోని ప్రయాణికుల మెడల్లోని బంగారు గొలుసులు తెంచుకుని పారిపోయారు.

- ఎస్‌-4,9,10 బోగీలలో చోరీ

- పలువురి మెడల్లోని బంగారు గొలుసుల అపహరణ

సికింద్రాబాద్‌: బీదర్‌, పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ రైల్లో(Bidar, Padmavati Express train) దొంగలు పడ్డారు. విజయవాడ నుంచి సికింద్రాబాద్‌(Vijayawada to Secunderabad) వైపు వస్తున్న పద్మావతి, బీదర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఎస్‌- 4,9,10 బోగిలోని ప్రయాణికుల మెడల్లోని బంగారు గొలుసులు తెంచుకుని పారిపోయారు. ఈ ఘటన చింతకాని మండలం పందిళ్లపల్లి(Pandallapalli) వద్ద చోటు చేసుకుంది. సికింద్రాబాద్‌ రైల్వే పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై మాజీద్‌ తెలిపిన వివరాల ప్రకారం బుధవారం అర్థరాత్రి 1.30 గంటల ప్రాంతంలో చింతకాని మండలం పందిళ్లపల్లి రైల్వే స్టేషన్‌ మధ్యలో సిగ్నల్‌ కట్‌ చేయడంతో రైలు ఆగిపోయింది. ఆ సమయంలో కింద రైలు పట్టాలపై ఉన్న నలుగురు దొంగలు ఎస్‌-4,9,10 బోగిలలో కిటికీల పక్కన కూర్చున్న ప్రయాణికులు మెడలలోని బంగారు గొలుసులు తెంచుకుని పారిపోయారు.

ఇదికూడా చదవండి: Cyber ​​criminals: స్కైప్‌ యూజర్లే వారి టార్గెట్‌...


ఎస్‌4 బోగిలో ప్రయాణం చేస్తున్న పద్మావతి అనే మహిళ మెడలో బంగారు గొలుసు, వర్థనమ్మ మెడలో నుంచి 20గ్రాముల బంగారు గొలుసు, వి.కుమార్‌ అనే ప్రయాణికుడి మెడలో 16 గ్రాములు బంగారు గొలుసు, జనరల్‌ బోగిలో ప్రయాణం చేస్తున్న కీర్తన బ్యాగులో ఉన్న రూ. 13 వేల నగదు కిటికీల నుంచి ఎత్తుకెళ్లిపోయారు. బాధిత ప్రయాణికులందరూ గురువారం సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులకు వేర్వేరుగా ఫిర్యాదుల చేశారు. కేసు నమోదు చేసుకున్న జీఆర్‌పి పోలీసులు ఖమ్మం జీఆర్‌పీ పోలీసులకు(Khammam GRP Police) బదిలీ చేశారు. సిగ్నల్‌ కట్‌ చేసి రైళ్లలో దోపిడికి పాల్పడినట్లు విచారణలో తెలిసింది.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 14 , 2024 | 01:01 PM

Advertising
Advertising