ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Medchal: మేడ్చల్ జిల్లాలో ఘోర ప్రమాదం.. విద్యుత్ షాక్‌తో..

ABN, Publish Date - Oct 07 , 2024 | 04:23 PM

గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధి కండ్లకోయ గ్రామంలోని హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది. విద్యుదాఘాతంతో ఇద్దరు కార్మికులు మృతిచెందగా మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి.

మేడ్చల్: గుండ్ల పోచంపల్లి (Gundla Pochampalli) మున్సిపాలిటీ పరిధి కండ్లకోయ గ్రామంలోని హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ (HULC) కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది. విద్యుదాఘాతంతో ఇద్దరు కార్మికులు మృతిచెందగా మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. రోజువారీ పనుల్లో భాగంగా కార్మికులు ఇనుప నిచ్చెనను బ్యారక్‌కు మార్చుతుండగా ప్రమాదం జరిగింది. నిచ్చెన మారుస్తుండగా మెయిన్‌గేట్ సమీపంలోని 11కేవీ విద్యుత్ తీగలు ప్రమాదవశాత్తూ దానికి తగిలాయి. దీంతో ఒక్కసారిగా ఆరుగురు కార్మికులు ప్రమాదానికి గురయ్యారు. వారిలో గుడు బైటా(26), పురో మాంఝీ(25) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక సీఎంఆర్ ఆస్పత్రికి తరలించారు. వీరంతా బీహార్‌కు చెందిన కార్మికులుగా తెలుస్తోంది. అయితే ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల కుటంబ సభ్యులకు సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి...

Congress Vs BRS: గజ్వేల్‌లో కేసీఆర్ క్యాంప్ కార్యాలయం ముట్టడి

Ponnam: ప్రతీ ఒక్కరు బీసీ సంక్షేమ గౌరవాన్ని కాపాడాలి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 07 , 2024 | 04:24 PM