Youtube: బ్యాంక్ దోపిడీ ఎలా చేయాలి...? యూట్యూబ్ చూస్తూ చోరీకి యత్నం
ABN, Publish Date - May 15 , 2024 | 12:40 PM
యూట్యూబ్(Youtube) చూస్తూ బ్యాంక్‌లో చోరీకి యత్నించిన ఎంబీఏ పట్టభద్రుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయమై పోలీసుల కథనం మేరకు... మదురై జిల్లా ఉసిలంపట్టి సమీపం అరియపట్టి గ్రామానికి చెందిన లెనిన్ (30) ఎంబీఏ పూర్తిచేసి చెన్నైలోని ఓ ప్రైవేటు బ్యాంక్‌లో పనిచేస్తున్నాడు.
చెన్నై: యూట్యూబ్(Youtube) చూస్తూ బ్యాంక్‌లో చోరీకి యత్నించిన ఎంబీఏ పట్టభద్రుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయమై పోలీసుల కథనం మేరకు... మదురై జిల్లా ఉసిలంపట్టి సమీపం అరియపట్టి గ్రామానికి చెందిన లెనిన్ (30) ఎంబీఏ పూర్తిచేసి చెన్నైలోని ఓ ప్రైవేటు బ్యాంక్‌లో పనిచేస్తున్నాడు. అక్కడ తక్కువ జీతం ఇస్తున్నారంటూ ఉద్యోగం మానేసిన లెనిన్ స్వగ్రామానికి వెళ్లాడు. అనంతరం ఆన్‌లైన్ జూదం ఆడి రూ.5 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. పోయిన నగదు సంపాదించడం ఎలా అని లెనిన్(Lenin) పలు రకాలుగా ఆలోచించాడు.
ఇదికూడా చదవండి: పార్సిల్ పేరుతో బెదిరింపులు.. కోట్లు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లు
ఈ క్రమంలో, యూట్యూబ్‌లో బ్యాంక్‌లో దొంగతనం ఎలా చేయాలి, అందుకు వినియోగించాల్సిన పరికరాలు తదితర వీడియోలు చూశాడు. దోపిడీకి అవసరమైన పరికరాలను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశాడు. అనంతరం ఉసిలంపట్టిలోని ఓ ఫైనాన్స్ సంస్థలో దోపిడీ చేసేందుకు సంస్థ తలుపులు బద్దలుకొట్టాడు. ఆ సమయంలో అటువైపు గస్తీ కి వెళ్లిన ఉసిలంపట్టి స్పెషల్ ఎస్‌ఐ శాంతి, కానిస్టేబుల్ అన్బుకుమార్‌లను చూసిన లెనిన్ పరారయ్యాడు. కార్యాలయంలో ప్రాంగణంలో ఉన్న మోటార్ బైక్ పరిశీలించగా, అందులో దొంగతనానికి అవసరమైన పరికరాలు గుర్తించారు. అనంతరం ఆ ప్రాంతంలో ఉన్న సీసీ ఫుటేజీ ఆధారంగా లెనిన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదికూడా చదవండి: Chennai: ముగ్గురుని బలితీసుకున్న వివాహేతర సంబంధం..
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - May 15 , 2024 | 12:40 PM