Tirumala: గంటలో 4 లక్షలకు పైగా టికెట్ల విక్రయం
ABN, Publish Date - May 24 , 2024 | 06:59 PM
కలియుగ ప్రత్యక్ష దైవం, అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. వేసవి సెలవులు రావడం, ఎన్నికలు ముగియడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల పైగా సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనాన్ని నిలిపివేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో వెల్లడించింది.
హైదరాబాద్: కలియుగ ప్రత్యక్ష దైవం, అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు తిరుమల శ్రీవారిని (Tirumala Srivaru) దర్శించుకునేందుకు భక్తులు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. వేసవి సెలవులు రావడం, ఎన్నికలు ముగియడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల పైగా సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనాన్ని నిలిపివేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో వెల్లడించింది.
హాట్ కేకుల్లా..
తిరుమల శ్రీవారి సర్వ దర్శనం కోసం కనీసం ఒక రోజు పడుతుంది. టోకెన్ దర్శనం 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. స్పెషల్ ఎంట్రీ టికెట్ తీసుకుంటే మూడు గంటల్లో దర్శనం అవుతుంది. అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. టీటీడీ వెబ్ సైట్‌లో మొబైల్ లేదంటే ల్యాప్ టాప్‌లో బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆగస్ట్ నెలకు సంబంధించి ఈ రోజు ఉదయం 10 గంటలకు స్పెషల్ దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేసింది.
గంట 27 నిమిషాల్లో
టికెట్లు విడుదలైన గంటన్నరలో 4 లక్షల 65 వేల టికెట్లను భక్తులు కొనుగోలు చేశారు. స్పెషల్ టికెట్ ఉంటే తొందరగా దర్శనం అవుతుందని అంతా భావించారు. దాంతో కొనుగోలు చేసేందుకు అమితాసక్తి చూపించారు. వేసవి ముగిసినప్పటికీ ఆగస్ట్ నెల టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. టికెట్ తీసుకున్న తర్వాత వసతి కోసం టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. తిరుమలతో పాటు తిరుపతిలో కూడా టీటీడీ గదులు అందుబాటులో ఉంటాయి.
Read Latest APNews and Telugu News
Updated Date - May 24 , 2024 | 06:59 PM