Arunachalam Tour: దసరా వేళ అరుణాచలేశ్వరుడి దర్శనం.. తెలంగాణ టూరిజం సూపర్ ప్యాకేజీ !
ABN , Publish Date - Oct 02 , 2024 | 06:04 PM
తమిళనాడులోని అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణ భారతదేశంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నికి ఈ క్షేత్రం ప్రతీక. దసరా సెలవుల సందర్భంగా ఆ అరుణాచలేశ్వరుడిని దర్శించుకునే భక్తులకు తెలంగాణ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది.
తమిళనాడులోని అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణ భారతదేశంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నికి ఈ క్షేత్రం ప్రతీక. దసరా సెలవుల సందర్భంగా ఆ అరుణాచలేశ్వరుడిని దర్శించుకునే భక్తులకు తెలంగాణ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. అరుణాచలం వెళ్లేందుకు తెలంగాణ టూరిజం HYDERABAD - ARUNACHALAM పేరుతో ప్యాకేజీని భక్తుల కోసం అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ నుంచి అరుణాచలానికి రోడ్డు మార్గం ద్వారా 4 రోజుల పర్యటన సాగుతుంది.
నెలలో ఒక్కసారి మాత్రమే ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఈ అక్టోబర్ 14వ తేదీన ఈ ప్రయాణం ప్రారంభంకానుంది. అంటే అక్టోబర్ 12వ తేదీ దసరా పండగ. దీంతో ఆ రెండు రోజులకే హైదరాబాద్ నుంచి అరుణాచలానికి ప్రయాణం అందుబాటులోకి తీసుకు రానుంది. ఓ వేళ ఇది మిస్ అయితే.. వచ్చే నవంబర్‌లో వెళ్లొచ్చు. అందుకు ప్రయాణానికి ప్లాన్ చేసుకుని టికెట్ల బుకింగ్ చేసుకోవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా అరుణాచలేశ్వరునికి భక్తులున్నారు. ఆయన్ని దర్శించుకునేందుకు అరుణాచలానికి తరలి వస్తుంటారు. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి అరుణాచలానికి వెళ్లే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా.. అతి తక్కువ ధరలోనే ప్యాకేజీని అందించే ఉద్దేశ్యంతో తెలంగాణ పర్యాటక శాఖ ఈ ప్యాకేజీని రూపొందించింది.
తెలంగాణ పర్యాటక శాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం... తొలి రోజు సాయంత్రం 6:30 నుంచి హైదరాబాద్‌లోని బషీర్ బాగ్ నుంచి బస్సు బయలుదేరుతుంది. ఆ మరునాడు ఉదయం కాణిపాకం చేరుకుంటుంది. ఉదయం 9 గంటల లోపు దర్శనం వినాయకుడి దర్శనం పూర్తవుతుంది. ఆ తర్వాత తిరువణ్ణమలైకి బస్సు బయలుదేరుతుంది.
మధ్యాహ్నం 3 గంటలకు అరుణాచలం చేరుకుంటుంది. ఆ అగ్ని లింగేశ్వరని దర్శనాన్ని భక్తులు పూర్తి చేసుకుంటారు. ఆ రాత్రి అరుణాచలంలోనే బస చేస్తారు. ఇక మూడో రోజు బ్రేక్ ఫాస్ట్ అనంతరం వేలూరుకు బస్సు బయలుదేరుతుంది. శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దర్శనం ఉంటుంది. ఆ రోజు సాయంత్రం 4 తర్వాత బస్సు హైదరాబాద్ బయలుదేరుతుంది. నాలుగో రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్‌కు బస్సు చేరుకుంటుంది. దీంతో ఈ టూర్ ప్యాకేజీ ముగినట్లు అవుతుంది. ప్రస్తుతం టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు.
ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకునేందుకు https://tourism.telangana.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించ వచ్చు. ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఇంకా ఏమైనా సందేహాలుంటే మాత్రం 9848540371 సెల్ ఫోన్ నెంబర్‌ను సంప్రదించవచ్చు. లేకుంటే info@tstdc.in మెయిల్ ద్వారా పర్యాటక శాఖ అధికారులను సైతం సంప్రదించవచ్చు.
Read More Devotional News and Latest Telugu News