ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Dussehra Holidays 2024: దసర వేడుకలు చూడాలంటే.. ఈ నగరాలకు వెళ్లాల్సిందే..

ABN, Publish Date - Oct 02 , 2024 | 06:46 PM

విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో దసరా ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతాయి. ఈ దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారు రోజుకు ఒక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు.

Dussehra 2024 దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమైనాయి. ఈ నవరాత్రుల్లో అమ్మలగన్నయమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ.. వివిధ అలంకారాల్లో పలు రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. అటు కశ్మీర్ నుంచి ఇటు కన్యాకుమారి వరకు.. ప్రముఖ నగరాల్లో ఈ దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.


కోల్‌కతాలో..

దసరా ఉత్సవాలు అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది కోల్‌కతా మహానగరం. ఈ నగరంలో దేవీ నవరాత్రుల వేళ.. పూజలు ఘనంగా నిర్వహిస్తారు. పశ్చిమ బంగాల్‌లో వివిధ ప్రాంతాల్లో వివిధ రీతుల్లో దుర్గమ్మ వారిని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఉత్సవాల సందర్భంగా కోల్‌కతా మహానగరమంతా పండుగ వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా బెంగాలీల ఆచార, వ్యవహారాలు ప్రపంచ యాత్రికులను విపరీతంగా ఆకట్టుకుంటాయి.


మైసూర్‌లో వేడుకలు..

కోల్‌కతా అనంతరం దసరా ఉత్సవాలు చూడాలంటే మాత్రం కర్ణాటకలోని మైసూర్ వెళ్లాల్సిందే. అక్కడి వడియార్ రాజ వంశస్థులు ఎన్నో సంవత్సరాలగా దసరా వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తు వస్తున్నారు. నవరాత్రుల వేళ మైసూరు మహానగరం అత్యంత సుందరంగా ముస్తాబవుతుంది.

ఈ ఉత్సవాల సందర్భంగా కళాకారుల ప్రదర్శనలు, వివిధ సాంస్కృ‌తిక పోటీలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు దేశీ విదేశాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో మైసూర్‌కు తరలి వస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే.


ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో..

ఇక కోల్‌కతా, మైసూరు అనంతరం దసరా వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలోని రామ్‌‌లీలా మైదానంలో అద్భుతంగా నిర్వహిస్తారు. ఈ నవరాత్రులు వేళ ఇక్కడ రంగ స్థల నటులు రామాయణం కథలను నాటకాలగా ప్రదర్శిస్తారు. దసరా పర్వదినం సందర్భంగా ఈ మైదానంలో భారీ రావణాసురుని విగ్రహాన్ని ప్రజలు దహనం చేస్తారు. అనంతరం ఘనంగా దసరా సంబరాలు జరుపుకుంటారు. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని చూసేందుకు దేశ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు ఢిల్లీకి తరలి వస్తారు.


ఆంధ్రప్రదేశ్ విజయవాడలో..

విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో దసరా ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతాయి. ఈ దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారు రోజుకు ఒక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు.. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తుతారు.


ఇక దసరా పండగ రోజు.. దుర్గమ్మ వారిని కృష్ణానదిలో విహరిస్తారు. అందుకోసం ప్రత్యేక పడవలో ఆమె జల విహారం చేస్తారు. ఆమ్మ వారి జల విహారాన్ని వీక్షించేందుకు నగర ప్రజలే కాదు.. దేశ విదేశీయులు సైతం విజయవాడకు తరలి వస్తారు.

దసరా నవరాత్రుల వేళ కోల్‌కతా, మైసూర్, న్యూఢిల్లీ, విజయవాడ తదితర ఏదో ఒక నగరానికి వెళ్లితే.. అమ్మవారిని దర్శనాన్నే కాదు.. ఆ యా నగరాలను సైతం సందర్శించినట్లు ఉంటుంది.

Read More Devotional News and Latest Telugu News

Updated Date - Oct 02 , 2024 | 06:50 PM