ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Durga Maa: రూ.16.5 లక్షల విలువైన మంగళసూత్రం.. ఎవరు చేయించారంటే..

ABN, Publish Date - Oct 05 , 2024 | 02:36 PM

దసరా మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మూడో రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

విజయవాడ: దసరా మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మూడో రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. మెక్కులు చెల్లించుని తమను ఆయురారోగ్యాలు, అష్టఐశ్వర్యాలతో ఉండేలా దీవించాలంటూ అమ్మవారిని వేడుకుంటున్నారు.


ఈ సందర్భంగా అమ్మవారికి ఓ సాధారణ భక్తుడు సమర్పించిన కానుక తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రకాశం జిల్లా కొంపేపికి చెందిన అంకులయ్య కొబ్బరి బొండాలు కొట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే సంవత్సరాలపాటు ఎంతో కష్టపడి రూపాయి, రూపాయి పోగేసి అతను అమ్మవారికి ఓ భారీ కానుక సమర్పించారు. ఏకంగా 203గ్రాముల బంగారు మంగళసూత్రాల తాడును అమ్మవారికి చేయించాడు.


ఇవాళ ఉదయం కనకదుర్గమ్మను దర్శించుకున్న అంకులయ్య, రాజేశ్వరి దంపతులు రూ.16.5లక్షల విలువైన ఆ మంగళసూత్రాలను కనకదుర్గమ్మకు సమర్పించారు. తమ సంపాదనలో ప్రతి రోజూ కొంత దాచి అమ్మవారికి సూత్రాలుగా చేయించినట్లు అంకులయ్య దంపతులు చెప్తున్నారు. అమ్మవారంటే తమకు ఎంతో ఇష్టమని, అందుకే ఎంత కష్టమైనా ఈ పని పూర్తి చేశామని అంటున్నారు. దీన్ని బట్టే అమ్మవారంటే భక్తులకు ఎంత ప్రీతో అర్థం అవుతుందని పలువురు చర్చించుకుంటున్నారు.

Updated Date - Oct 05 , 2024 | 02:36 PM