JNTU: రెగ్యులర్ వీసీనా.. మళ్లీ ఇన్‌చార్జేనా..
ABN, Publish Date - Dec 01 , 2024 | 11:28 AM
జేఎన్‌టీయూ(JNTU)కు ఆర్నెల్లుగా రెగ్యులర్ వైస్‌చాన్స్‌లర్ లేరు. గత మే 22 నుంచి యూనివర్సిటీకి ఇన్‌చార్జి వీసీగా వ్యవహరిస్తున్న ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం(IAS officer Burra Venkatesham)ను ప్రభుత్వం తాజాగా టీజీపీఎస్సీ చైర్మన్‌గా నియమించింది.
- టీజీపీఎస్సీ చైర్మన్‌గా బుర్రా నియామకంతో జేఎన్‌టీయూలో ఊహాగానాలు
హైదరాబాద్ సిటీ: జేఎన్‌టీయూ(JNTU)కు ఆర్నెల్లుగా రెగ్యులర్ వైస్‌చాన్స్‌లర్ లేరు. గత మే 22 నుంచి యూనివర్సిటీకి ఇన్‌చార్జి వీసీగా వ్యవహరిస్తున్న ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం(IAS officer Burra Venkatesham)ను ప్రభుత్వం తాజాగా టీజీపీఎస్సీ చైర్మన్‌గా నియమించింది. దీంతో ఖాళీ అవుతున్న వైస్‌చాన్స్‌లర్ పోస్టులో ఎవర్ని నియమిస్తారనే అంశంపై యూనివర్సిటీ వర్గాల్లో మళ్లీ చర్చ మొదలైంది. ఆర్నెల్లకు పైగా వైస్‌చాన్స్‌లర్ పోస్టు ఖాళీగా ఉండడంతో యూనివర్సిటీ అభివృద్ధి కుంటుపడుతోందని విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
ఈ వార్తను కూడా చదవండి: రైతు భరోసాపై మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన
మరోవైపు ఇన్‌చార్జి వీసీగా 200రోజుల పాటు వ్యవహరించిన ఐఏఎస్ అధికారి యూనివర్సిటీకి పట్టుమని 10సార్లు కూడా రాకపోవడంతో వందల సంఖ్యలో ఫైళ్లు నెలల తరబడి పెండింగ్‌లోనే ఉండిపోయాయి. కీలకమైన నిర్ణయాలపై సమాలోచనలు జరగకపోవడం, అత్యవసరంగా తీసుకోవాల్సిన నిర్ణయాల్లో ఎడతెగని జాప్యం నెలకొనడంతో యూనివర్సిటీ తిరోగమన బాట పట్టింది. యూనివర్సిటీపై ఇన్‌చార్జి వీసీ అంతగా ఫోకస్ పెట్టకపోవడంతో కిందిస్థాయి అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు.
ఈ విషయమై ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదులు అందడంతో జేఎన్‌టీయూకు ఇన్‌చార్జి వీసీగా ఉన్న ఐఏఎస్ అధికారిని ఆ బాధ్యతల నుంచి తప్పించినట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం జేఎన్‌టీయూకు రెగ్యులర్ వీసీని నియమిస్తుందా లేక మరొక ఐఏఎస్ అధికారికే ఇన్‌చా ర్జి వీసీగా బాధ్యతలు అప్పగిస్తుందా అని అటు విద్యార్థుల్లోనూ ఇటు అధికార వర్గాల్లోనూ మీ మాంస నెలకొంది. ఇదిలా ఉంటే.. గతంలో సు మారు రెండేళ్ల పాటు ఇన్‌చార్జి వీసీగా పనిచేసిన ఓ మహిళా ఐఏఎస్ అధికారికే మరలా బాధ్యత లు అప్పగించే అవకాశం ఉన్నట్టు పుకార్లు షికా రు చేస్తున్నాయి.
మరోవైపు యూనివర్సిటీలో సుదీర్ఘకాలం పాటు వివిధ హోదాల్లో పనిచేసి, ప్రస్తుతం ఒక ఎన్‌ఐటీకి డైరెక్టర్‌గా వ్యవహరిస్తు న్న ఆచార్యుడిని త్వరలోనే జేఎన్‌టీయూకు రెగ్యులర్ వైస్‌చాన్స్‌లర్‌గా నియమిస్తారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. జేఎన్‌టీయూకు రెగ్యులర్ వీసీని నియమించే అంశంపై ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, ఆధ్యాపక సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
ఈవార్తను కూడా చదవండి: నిశ్శబ్దాన్ని ఛేదిస్తున్నారు
ఈవార్తను కూడా చదవండి: సస్పెండైన ఏఈఈ నిఖేష్ కుమార్ బాగోతం..
ఈవార్తను కూడా చదవండి: త్వరలో హైడ్రా పోలీస్‌స్టేషన్
ఈవార్తను కూడా చదవండి: ఏడాదిలోనే ఆలయాల్లో సౌకర్యాలు మెరుగుపరిచాం
Read Latest Telangana News and National News
Updated Date - Dec 01 , 2024 | 11:28 AM