Share News

PM Internship Scheme 2024: PM ఇంటర్న్‌షిప్ పథకానికి అప్లై చేసుకున్నారా? దీనికి చివరి తేదీ ఎప్పుడంటే..

ABN , Publish Date - Nov 08 , 2024 | 06:36 PM

కోటి మంది యువతను ఇందులో భాగస్వామ్యం చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఈ ఏడాది..

PM Internship Scheme 2024: PM ఇంటర్న్‌షిప్ పథకానికి అప్లై చేసుకున్నారా? దీనికి చివరి తేదీ ఎప్పుడంటే..
PM Internship Scheme 2024:

భారతీయ భవిష్యత్తు మొత్తం యువత చేతిలోనే ఉంది అని అన్నారు స్వామి వివేకానంద. ఆయన యువతకు ఇచ్చిన స్పూర్తి, యువతను ఉద్దేశించి చెప్పిన మాటలు నేటికీ స్ఫూర్తిదాయకమే.. అయితే భారతదేశంలో యువత వివిధ రంగాలలో అభివృద్ది చెందడానికి సరైన మార్గ నిర్దేశకత్వం, అవకాశాలు మాత్రం అరకొరగా ఉన్నాయని చెప్పవచ్చు. టెక్నాలజీ, వ్యాపార మెళకువలు, ఉద్యోగాల పరంపర కొందరి చేతులలోనే ఉంటోంది. ఇవన్నీ అధిగమించి భారతీయ యువత భవిష్యత్తును బంగారుమయం చేయడానికి.. భారతదేశ అభివృద్ది యువత చేతిలో సాగడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకమే పిఎమ్ ఇంటర్న్‌షిప్ పథకం. ఈ పథకానికి అప్లై చేసుకున్న వారి జీవితం కీలక మలుపు తిరుగుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.. కోటి మంది యువతను ఇందులో భాగస్వామ్యం చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఈ ఏడాది నవంబర్ 10వ తేదీ ఆఖరు. అసలు ఈ పథకం చేకూర్చే ప్రయోజనం ఏంటి? ఈ పథకానికి ఎవరు అర్హులు.. ఈ పథకం కింద యువత ఏం నేర్చుకుంటుంది. ఇంటర్న్‌షిప్ తరువాత యువత పయనం ఎలా ఉంటుంది? తెలుసుకుంటే..

Custard Apple: సీతాఫలాల కాలం.. ఆరోగ్యానికి భలే లాభం..


పిఎమ్ ఇంటర్న్‌షిప్ పథకం..

ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం భారతదేశంలోని 500 అత్యుత్తమ కంపెనీలలో యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందించడానికి ఉద్దేశించిన పథకం. ఇందులో యువతకు వివిధ రంగాలకు సంబంధించిన నైపుణ్యాలను, మెళకువలను తెలుసుకునే, నేర్చుకునే అవకాశం ఉంటుంది. 12 నెలల పాటు సాగే ఈ ఇంటర్న్‌షిప్ లో యువతకు ప్రతి నెలా రూ.5వేల స్టేఫండ్ అందుతుంది. ఇంటర్న్‌షిప్ లో చేరిన తరువాత భారత ప్రభుత్వం అభ్యర్థికి రూ.6వేల గ్రాంట్ ను అందిస్తుంది.

విద్యార్హత..

ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం కు అప్లై చేసుకోవాలంటే.. ITI నుండి సర్టిఫికెట్ కలిగి ఉండాలి. పాలిటెక్నిన్ ఇన్స్టిట్యూట్ నుండి డిప్లోమా కలిగి ఉండాలి. BA, B.Sc., B.Com, BCA, BBA, BPharma మొదలైన డిగ్రీలు ఉన్నవారు కూడా అర్హులే.

Skin Care: మెరిసే చర్మం కోసం ఫేస్ క్రీములు అక్కర్లేదు.. నీళ్లు ఇలా తాగి చూడండి..


వయోపరిమితి..

21 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు అభ్యర్థులు మాత్రమే ఇందులో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పూర్తీ సమయం ఉద్యోగం చేయని వారు, పూర్తీ సమయం చదువులో కొనసాగని వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ లోనూ, దూరవిద్య ద్వారా విద్యను అభ్యసిస్తున్నవారు కూడా దీనికి అర్హులు అవుతారు.

ఇక్కడ అప్లై చేసుకోండి..

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి https://pminternship.mca.gov.in/login లింక్ పై క్లిక్ చేయడం ద్వారా ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకానికి అప్లై చేసుకోవచ్చు.

  • అధికారిక వెబ్సైట్ లోకి వెళ్లాలి.

  • రిజిస్ట్రేషన్ లింక్ ను నావిగేట్ చేయాలి.

  • అక్కడ ఒక ఫారమ్ ఓపెన్ అవుతుంది.

  • ముందుగా అందులో రిజిస్టర్ చేసుకోవాలి.

  • ఇంటర్న్‌షిప్ కోసం ధరఖాస్తు చేసుకోవాలి.

  • ఎక్కడ ఇంటర్న్‌షిప్ చేయాలని అనుకుంటున్నారు, సెక్టార్, దేని కోసం ఇంటర్న్‌షిప్ అప్లై చేస్తున్నారు, విద్యార్హత ఏంటి, ప్రాధాన్యతలు ఏంటి మొదలైన వివరాలు అన్నీ పొందుపరచలాలి. ఇవన్నీ పొందుపరిచిన తరువాత సబ్మిట్ చేయాలి.

  • ఫ్యూచర్ లో అప్లికేషన్ ఉపయోగార్థం దాన్ని డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి. ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకానికి అప్లై చేసుకోవడానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

షార్ట్ లిస్టింగ్, ఎంపిక ఇలా ఉంటుంది..

అభ్యర్థుల ఎంపిక అభ్యర్థులు అప్లికేషన్ లో పేర్కొన్న తమ ప్రాధాన్యలు, కంపెనీల అవసరాలపై ఆధారపడి ఉంటుంది.

ఇవి కూడా చదవండి..

మీకు సీతాఫలం అంటే ఇష్టమా.. ఈ నిజాలు తెలిస్తే..

వామ్మో.. ఈ పండ్లు తినకండి బాబూ.. బరువు పెరుగుతారు..

మరిన్ని విద్యా వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Nov 08 , 2024 | 06:36 PM