ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Telangana DSC Notification 2024: ఏ జిల్లాలో ఎన్ని టీచర్ పోస్టులు ఉన్నాయో తెలుసా? వివరాలు మీకోసం..

ABN, Publish Date - Mar 01 , 2024 | 02:18 PM

Telangana DSC Notification 2024: తెలంగాణలో(Telangana) ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రానే వచ్చేంది. గత ప్రభుత్వం వేసిన పోస్టుల కంటే ఎక్కువ పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్(DSC Notification) రిలీజ్ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress) ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). గత ప్రభుత్వం 5,089 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా..

Telangana DSC Notification 2024

Telangana DSC Notification 2024: తెలంగాణలో(Telangana) ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రానే వచ్చేంది. గత ప్రభుత్వం వేసిన పోస్టుల కంటే ఎక్కువ పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్(DSC Notification) రిలీజ్ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress) ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). గత ప్రభుత్వం 5,089 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. ఆ నోటిపికేషన్‌ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్‌ను ఇచ్చింది రేవంత్ సర్కార్. అయితే, పెరిగిన పోస్టులతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. మొదటి నోటిఫికేషన్‌లో పోస్టులు తక్కువగా ఉండటంతో ఆందోళనకు గురైన అభ్యర్థులు.. ఇప్పుడు ధైర్యంగా ప్రిపరేషన్ మొదలు పెట్టారు. గతంలో టీచర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవక్కర్లేదు. మునుపు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు మార్చి 4 నుంచి ఏప్రిల్‌ 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

రాష్ట్ర వ్యాప్తంగా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా.. వీటిలో అత్యధికంగా ఎస్జీటీ 6,508 పోస్టులు ఉన్నాయి. ఆ తరువాత స్కూల్‌ అసిస్టెంట్‌ 2,629 పోస్టులు ఉన్నాయి. ఏ విభాగంలో ఎన్ని పోస్టులు ఉన్నాయి.. ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి.. అనే వివరాలను మీకోసం..

పోస్టు పేపరు ఖాళీలు

స్కూల్‌ అసిస్టెంట్‌ 2,629

లాంగ్వేజ్‌ పండిట్‌ 727

ఫిజికల్‌ ఎడ్యుకే షన్‌ 182

ఎస్జీటీ 6,508

ఎస్‌ఏ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) 220

ఎస్‌జీటీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) 796

మొత్తం 11,062

జిల్లాల వారీగా పోస్టుల వివరాలు

ఆదిలాబాద్‌ 324

కొత్తగూడెం 447

హనుమకొండ 187

హైదరాబాద్‌ 878

జగిత్యాల 334

జనగాం 221

జయశంకర్‌ 237

గద్వాల 172

కామారెడ్డి 506

కరీంనగర్‌ 245

ఖమ్మం 575

కొమురం బీం 341

మహబుబాబాద్‌ 381

మహబూబ్‌నగర్‌ 243

మంచిర్యాల 288

మెదక్‌ 310

మెడ్చెల్‌ 109

ములుగు 192

నాగర్‌కర్నూలు 285

నల్లగొండ 605

నారాయణపేట 279

నిర్మల్‌ 342

నిజామాబాద్‌ 601

పెద్దపల్లి 93

రాజన్న సిరిసిల్ల 151

రంగారెడ్డి 379

సంగారెడ్డి 551

సిద్దిపేట 311

సూర్యాపేట 386

వికారాబాద్‌ 359

వనపర్తి 152

వరంగల్‌ 301

యాదాద్రి 277

మొత్తం 11,062

మరిన్ని ఉద్యోగ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 01 , 2024 | 02:18 PM

Advertising
Advertising