Job Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారీ నోటిఫికేషన్..
ABN, Publish Date - Dec 02 , 2024 | 06:55 PM
నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఖాళీల భర్తీకి సంబంధించి నోటీఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగ ప్రకటనలో ఖాళీలు, జీతభత్యాలు, అర్హతలు సహా పూర్తి వివరాల కింద చూడొచ్చు..
Andhra Pradesh Civil Assistant Surgeon Notification 2024: రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిపికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ పరిధిలో మొత్తం 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ చేయనున్నారు. బ్యాక్‌లాగ్, రెగ్యులర్ పోస్టులను.. పీహెచ్‌సీలు/ఇతర వైద్య సంస్థల్లో రెగ్యులర్ ప్రాతిపదికన నియామకం చేపట్టనుంది ప్రభుత్వం. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి..
ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న 280 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటి దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 4వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. చివరి తేదీగా డిసెంబర్ 13ను నిర్ణయించారు. ఆసక్తిగల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటున్న అభ్యర్థులు.. అధికారిక వెబ్‌సైట్ http:apmsrb.ap.gov.in/msrb/ ను సందర్శించవచ్చు. ఈ వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులు తమ అప్లికేషన్ ఫిల్ చేయవచ్చు.
ఫీజు, అర్హతలు, వయోపరిమితి..
280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు.. ముందుగా దరఖాస్తుకు అవసరమైన అర్హతలు తెలుసుకోవాలి. అర్హతలన్నీ ఉన్నాయనుకున్నప్పుడు అప్లై చేసుకోవచ్చు. ఇక ఫీజు, వయోపరిమితికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ http:apmsrb.ap.gov.in/msrb/లో నోటిఫికేషన్‌ను వివరాలను పరిశీలించవచ్చు. ఈ నోటిఫికేషన్‌ను పోస్టుల భర్తీకి సంబంధించి సమగ్ర వివరాలు పేర్కొనడం జరిగింది.
Also Read:
లారీ బీభత్సం.. టైర్లకింద నలిగిన ప్రాణాలు..
అంతా మీరే చేశారు.. సీఎం రేవంత్ ధ్వజం
ఎంత నీరు తాగుతున్నా దాహంగా ఉంటోందా?
For More Education News and Telugu News..
Updated Date - Dec 02 , 2024 | 06:55 PM