Karnataka: కర్ణాటకలో కీలక పరిణామం.. బీజేపీలో గాలి జనార్దన్ రెడ్డి పార్టీ విలీనం
ABN, Publish Date - Mar 25 , 2024 | 02:08 PM
లోక్ సభ ఎన్నికల వేళ కర్ణాటకలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటక రాజ్య ప్రగతి పక్ష పార్టీ భారతీయ జనతా పార్టీలో విలీనం అయ్యింది. కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర సమక్షంలో తన పార్టీని విలీనం చేస్తున్నట్టు మైనింగ్ వ్యాపార దిగ్గజం గాలి జనార్దన్ రెడ్డి ప్రకటించారు.
బెంగళూర్: లోక్ సభ ఎన్నికల వేళ కర్ణాటకలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటక రాజ్య ప్రగతి పక్ష పార్టీ భారతీయ జనతా పార్టీలో (BJP) విలీనం అయ్యింది. కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప (Yediyurappa), బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర సమక్షంలో పార్టీని విలీనం చేస్తున్నట్టు మైనింగ్ వ్యాపార దిగ్గజం గాలి జనార్దన్ రెడ్డి (Janardhana Reddy) ప్రకటించారు. ఆయనతోపాటు భార్య అరుణ లక్ష్మీ (aruna laxmi) బీజేపీలో చేరారు.
హ్యాపీగా ఉంది
‘తిరిగి సొంత పార్టీలోకి రావడం ఆనందంగా ఉంది. దేశంలో మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని అయ్యేందుకు తనవంతుగా సహకారం అందిస్తా. బీజేపీలోకి ఎలాంటి షరతులు లేకుండా వచ్చా. పార్టీలో తనకు ఎలాంటి పదవి వద్దు. పార్టీ విలీనం చేసే ముందు కార్యకర్తల అభిప్రాయం తీసుకున్నా. అండగా ఉంటారని హామీ ఇచ్చారు. బీజేపీ తనకు తల్లి వంటిది అని’ గాలి జనార్దన్ రెడ్డి తెలిపారు.
మంచి నిర్ణయం
‘బీజేపీలో చేరాలని మంచి నిర్ణయం జనార్దన్ తీసుకున్నారు. ఆయన పార్టీలో చేరడంతో బీజేపీ బలోపేతం అయ్యింది. జనార్దన్ సతీమణీ, అతని స్నేహితులు బీజేపీలో చేరడం శుభపరిణామం. ఇది కర్ణాటక బీజేపీకి కలిసి వస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 28 సీట్లను బీజేపీ గెలుస్తుంది. జనార్దన్‌ను హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నా అని’ యడియూరప్ప అభిప్రాయ పడ్డారు.
పార్టీ ఏర్పాటు, విలీనం
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనార్దన్ రెడ్డి బీజేపీని వీడి కర్ణాటక రాజ్య ప్రగతి పక్ష పార్టీని ఏర్పాటు చేశారు. గంగావతి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. లోక్ సభ ఎన్నికలకు ముందు పార్టీని బీజేపీలో విలీనం చేశారు. యడియూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జనార్దన్ రెడ్డి మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మైనింగ్ కుంభకోణంలో జనార్దన్ రెడ్డి జైలుకు కూడా వెళ్లి వచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇది కూడా చదవండి:
Kerala: వయనాడ్ నుంచి రాహుల్‌తో తలపడే బీజేపీ అభ్యర్థి ఎవరంటే?
Updated Date - Mar 25 , 2024 | 02:08 PM