Elections: తెలుగు రాష్ట్రాలకు 2 వేల బస్సులు.. 58 స్పెషల్ ట్రైన్స్
ABN, Publish Date - May 11 , 2024 | 09:58 AM
ఓటు హక్కు వినియోగించుకునేందుకు నగన వాసులు పల్లెబాట పట్టారు. ప్రయాణికులతో జేబీఎస్, ఎంజీబీఎస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఎన్నికలవేళ టీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాలకు ఆర్టీసీ 2 వేల ప్రత్యేక బస్సులు నడుపుతోంది.
హైదరాబాద్ : ఓటు హక్కు వినియోగించుకునేందుకు నగన వాసులు పల్లెబాట పట్టారు. ప్రయాణికులతో జేబీఎస్, ఎంజీబీఎస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఎన్నికలవేళ టీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాలకు ఆర్టీసీ 2 వేల ప్రత్యేక బస్సులు నడుపుతోంది. హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి 500 ప్రత్యేక బస్సులు.. జేబీఎస్ బస్టాండ్ నుంచి 200 స్పెషల్ బస్సులు... ఉప్పల్ నుంచి 300.. ఎల్బీ నగర్ నుంచి 300 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుతుతోంది. 58 ప్రత్యేక రైళ్ళను దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది. ప్రయాణికుల రద్దీని బట్టి సర్వీసులు పెంచుతామని రైల్వే అధికారులు చెబుతున్నారు.
Telangana Elections 2024: మెతుకు సీమ మద్దతెవరికో!
ఈ నెల 13న ఏపీ ఎన్నికలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలు సైతం జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఓట్ల పండుగకు జనం పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు బయలుదేరుతున్నారు. దీంతో బస్టాండ్, రైల్వే స్టేషన్‌లో దసరా, సంక్రాంతి పండుగ సమయాల్లో మాదిరిగా రద్దీ ప్రారంభమైంది. ప్రస్తుతమున్న ఆర్టీసీ సర్వీసులు కానీ.. రైళ్లు కానీ ఏమాత్రం సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలోనే రైల్వేతో పాటు ఆర్టీసీ స్పెషల్ సర్వీసులను నడుపుతోంది. అవసరాన్ని బట్టి ఇంకా సర్వీసులను పెంచుతామని అధికారులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి:
Hero Shivaji :ఏపీని కాపాడుకోవడానికి ఇదే చివరి అవకాశంఏపీని కాపాడుకోవడానికి ఇదే చివరి అవకాశం
Kodali Nani: ఏందయ్యా నానీ.. ఏంటీ ఈ వింత లీలలు!
Read Latest AP News and Telugu News
Updated Date - May 11 , 2024 | 10:09 AM