TG Elections: బీజేపీ 12 సీట్లు గెలిస్తే రేవంత్ సీఎం కుర్చీని ఆ దేవుడు కూడా కాపాడలేరు
ABN, Publish Date - Apr 17 , 2024 | 05:33 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ సీఎం కుర్చీని కాపాడుకోలేరని మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాలను గెలుచుకుంటుందని అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు.
నిజామాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Arvind) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ సీఎం కుర్చీని కాపాడుకోలేరని మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాలను గెలుచుకుంటుందని అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు. కనీసం 12 సీట్లు అయినా గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఆ తర్వాత రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని వివరించారు.
12 సీట్లు సాధిస్తే కీలక పరిణామాలు
బీజేపీ 12 సీట్లు సాధించడం పక్కా అంటున్నారు అర్వింద్. అలా జరిగితే రేవంత్ సీఎం కుర్చీని సాక్షాత్ ఆ శ్రీరాముడు కూడా కాపాడలేరని స్పష్టం చేశారు. కుర్చీ మారడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. ఆగస్టులో రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ చెబుతున్నారు..? ఆగస్ట్ వరకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారా..? అని ప్రశ్నించారు. ఇచ్చిన మాట ప్రకారం వెంటనే రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అందరికీ తెలుసు అని గుర్తుచేశారు. జాప్యం చేయకుండా రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Komatireddy: కాంగ్రెస్‌ను టచ్ చేసి చూడు.. కేసీఆర్‌కు కోమటిరెడ్డి హెచ్చరిక
400కి పైగా సీట్లు
నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో ధర్మపురి అర్వింద్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. గత పదేళ్లలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరుతున్నారు. సీఏఏ, ఎన్ఆర్సీ, యూసీసీ ఎందుకో ప్రజలకు వివరిస్తున్నామని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సీట్లు పెరుగుతాయని అర్వింద్ ఆశాభావం వ్యక్తం చేశారు. 400కు పైగా సీట్లు గెలిచి మూడోసారి మోదీ ప్రధాని పదవీ చేపడుతారని విశ్వసించారు.
Hyderabad: ఊపిరాడని ప్రయాణం.. మండే ఎండల్లో కిటకిటలాడుతున్న మెట్రో రైళ్లు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం
Updated Date - Apr 17 , 2024 | 06:03 PM