ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bandi Sanjay: బండి సంజయ్ మరోసారి సంచలన కామెంట్స్

ABN, Publish Date - May 11 , 2024 | 12:13 PM

మహా బైక్ ర్యాలీలో బండి సంజయ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనలో ముస్లిం జనాభా 43 శాతం పెరిగిందన్నారు. హిందువుల జనాభా 8 శాతం తగ్గిందన్నారు. మోదీ లేకపోతే భారత్ మరో పాకిస్తాన్‌లా మారే ప్రమాదం ఉందన్నారు. కొన్ని ఇస్లాం సంస్థలు భారత్‌ను ఇస్లామిక్ దేశంగా చేసే కుట్ర చేస్తున్నాయని పేర్కొన్నారు.

కరీంనగర్: మహా బైక్ ర్యాలీలో బండి సంజయ్ (Bandi Sanjay) మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనలో ముస్లిం జనాభా 43 శాతం పెరిగిందన్నారు. హిందువుల జనాభా 8 శాతం తగ్గిందన్నారు. మోదీ లేకపోతే భారత్ మరో పాకిస్తాన్‌లా మారే ప్రమాదం ఉందన్నారు. కొన్ని ఇస్లాం సంస్థలు భారత్‌ను ఇస్లామిక్ దేశంగా చేసే కుట్ర చేస్తున్నాయని పేర్కొన్నారు. ‘హమ్ దో.. హమారే దో’ విధానానికి తాను ఓటేస్తానని బండి సంజయ్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక దేశ ద్రోహి అని.. ఫోన్ ట్యాపింగ్ కేసు భయంతో దేశ భద్రత డేటాను కూడా ధ్వంసం చేశారని ఆరోపించారు.

Hyderabad: హైదరాబాద్‌ నుంచి సొంతూళ్లకు భారీగా పయనం..


కేసీఆర్ లాంటి దేశద్రోహిని ఎందుకు అరెస్ట్ చేయలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. ‘రేవంతన్నా... సరిహద్దుకు తీసుకుపోతా రా... సర్టికల్ స్ట్రయిక్స్ ఎలా చేసారో జవాన్లే నీకు రుచి చూపిస్తారు’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ను బంగాళాఖాతంలో కలిపేయాలన్నారు. తనను ఓడించేందుకు ఏబీసీ(అసద్, బీఆర్ఎస్, కాంగ్రెస్) గ్యాంగ్ ఒక్కటయ్యాయని తెలిపారు. ముస్లింలంతా ఒక్కటై తనను ఓడించాలని కేసీఆర్ పిలుపునిస్తున్నారని పేర్కొన్నారు. ‘మీరే నా ధైర్యం... మీరే నా ఆశ... మీరే నా శ్వాస...నా పోరాటానికి అండ దండ మీరే’ అని ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి: Elections: తెలుగు రాష్ట్రాలకు 2 వేల బస్సులు.. 58 స్పెషల్ ట్రైన్స్

Read Latest Telangana News and National News

Updated Date - May 11 , 2024 | 12:13 PM

Advertising
Advertising