ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Election 2024: అందుకే అయోధ్యకు వెళ్లలేదు.. శశి థరూర్ షాకింగ్ కామెంట్స్

ABN, Publish Date - May 10 , 2024 | 06:53 PM

కాంగ్రెస్‌లో మెజార్టీ నాయకులు హిందువులేనని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ (Shashi Tharoor) తెలిపారు. హిందువులం హిందువులను ఎందుకు ద్వేషిస్తామని ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని హోటల్ తాజ్ కృష్ణలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ద్వేషం అనేది కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉండనే ఉండదని స్పష్టం చేశారు.

Shashi Tharoor

హైదరాబాద్: కాంగ్రెస్‌లో మెజార్టీ నాయకులు హిందువులేనని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ (Shashi Tharoor) తెలిపారు. హిందువులం హిందువులను ఎందుకు ద్వేషిస్తామని ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని హోటల్ తాజ్ కృష్ణలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ద్వేషం అనేది కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉండనే ఉండదని స్పష్టం చేశారు. ద్వేషం అనే బజార్లో ప్రేమ దుకాణం తెరిచామన్నదే తమ నినాదమన్నారు. జిహాద్ అంటే కత్తులు పట్టుకొని జనాలను చంపడం కాదని అన్నారు. మోదీ చెప్పిన వాగ్దానాలు నెరవేర్చలేదు కాబట్టే విద్వేషం పెంచే మాటలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.


Bandi Sanjay: కేసీఆర్ ఏమైనా సుద్ద పూసా? వేస్ట్ ఫెల్లో ఆఫ్ ఇండియా..

ఈ ఎన్నికలు మీ కోసం జరుగుతున్నాయని తెలిపారు. ఈ పడేళ్లలో కేంద్రం మీకు ఏమిచ్చిందో గుర్తు చేసుకోవాలని సూచించారు. విద్వేషాలు రెచ్చగొట్టడం తప్పా మోదీ ఏమీ చేశారని ప్రశ్నించారు. తమ మేనిఫెస్టో చూసి గర్వపడుతున్నానని అన్నారు. మేనిఫెస్టోలో అన్ని వర్గాల ప్రజల అంశాలను చేర్చామని వివరించారు. తెలంగాణకు బీజేపీ ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా ఎందుకు నెరవేర్చలేదని నిలదీశారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎందుకు ఓటేయాలి? అని ప్రశ్నించారు.


రామమందిరాన్ని ఎన్నికల కోసం వాడుతున్న విధానాన్నే తాము తప్పు పట్టామని అన్నారు. దేవుడ్ని రాజకీయం కోసం వాడుతున్నందుకే తాము ఆలయ ప్రారంభోత్సవానికి వెళ్లలేదని స్పష్టం చేశారు.ప్రజలను విడగొట్టడానికి బీజేపీ చాలాసార్లు మీడియాని వాడుకుందని చెప్పారు. కేజ్రీవాల్‌కి బెయిల్ ఇప్పటికైనా వచ్చినందుకు సంతోషమని తెలిపారు. రాజకీయ కక్షతోనే ‌కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు. జాతీయ ఐక్యత చాటడానికే ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సౌత్, నార్త్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారని శశి థరూర్ ఉద్ఘాటించారు.

Chintala Ramchandra Reddy: ఓటమి భయంతోనే బీజేపీపై దుష్ప్రచారం..

Read Latest Telangana News and Telugu News

Updated Date - May 10 , 2024 | 06:55 PM

Advertising
Advertising