Ghulam Nabi Azad: బీజేపీ గెలవాలని కాంగ్రెస్ కోరుకుంటోంది.. గులాం నబీ ఆజాద్ సంచలనం
ABN, Publish Date - Apr 16 , 2024 | 02:08 PM
కాంగ్రెస్ పార్టీపై డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధినేత గులాం నబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కూటమి పార్టీలు భారతీయ జనతా పార్టీతో సఖ్యంగా ఉంటాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, ఆ పార్టీతో కలిసి పనిచేసే భాగస్వామ్య పక్షాలు సొంతంగా బలం పెంచుకునే ప్రయత్నాలు చేయడం లేదని అభిప్రాయ పడ్డారు. బీజేపీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటుందా అనే సందేహాం కలిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దోడాలో జరిగిన బహిరంగ సభలో ఆజాద్ మాట్లాడారు.
దోడా: కాంగ్రెస్ పార్టీపై డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధినేత గులాం నబీ ఆజాద్ (Ghulam Nabi Azad) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ (Congress) కూటమి పార్టీలు భారతీయ జనతా పార్టీతో సఖ్యంగా ఉంటాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, ఆ పార్టీతో కలిసి పనిచేసే భాగస్వామ్య పక్షాలు సొంతంగా బలం పెంచుకునే ప్రయత్నాలు చేయడం లేదని ఆయన అభిప్రాయ పడ్డారు. దాంతో బీజేపీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటుందా అనే సందేహాం కలిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దోడాలో జరిగిన బహిరంగ సభలో ఆజాద్ మాట్లాడారు.
Ramdev Baba: మీరంత అమాయకులేం కాదు.. రాందేవ్‌పై సుప్రీం ఫైర్
బీజేపీ బీ టీమ్
కాంగ్రెస్ పార్టీ వ్యవస్థలో మార్పు రావాలని గతంలో 23 మంది నేతలు ధిక్కారం స్వరం వినిపించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పార్టీ వారిని అభిప్రాయాన్ని లెక్క చేయలేదు. పార్టీలో సమస్యను లెవనేత్తితో చాలు బీజేపీ మాదిరిగా మాట్లాడుతున్నారని అనేవారు. దాంతో తనకు కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ విజయం కోసం పనిచేస్తోందా అనే సందేహం కలిగేందని ఆజాద్ వివరించారు. కాంగ్రెస్ పార్టీలో ధిక్కారం స్వరం వినిపించిన వారిలో గులాం నబీ ఆజాద్ ఒకరు. కాంగ్రెస్ పార్టీని వీడి డీపీఏపీ పార్టీని ఏర్పాటు చేశారు. దేశంలో ప్రధాన సమస్య పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై నియంత్రణ ఒక్కటేనని ఆజాద్ అభిప్రాయ పడ్డారు.
ఇవే ప్రధాన సమస్యలు
దేశంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే పేదరిక నిర్మూలన, నిరుద్యోగం, ద్రవ్యోల్బణ నియంత్రణ ప్రధాన సమస్య అవుతాయని ఆజాద్ అభిప్రాయ పడ్డారు. ఎన్నికలు, మతం పేరుతో జరగవని అభివృద్ధితో జరుగుతాయని వివరించారు.
Bangalore: దుమారం రేపిన మాజీసీఎం కుమారస్వామి వ్యాఖ్యలు..
మరిన్ని జాతీయ వార్తల కోసం
Updated Date - Apr 16 , 2024 | 02:26 PM