మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Election 2024: సస్పెండ్ అయిన అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగులు

ABN, Publish Date - May 20 , 2024 | 03:26 PM

ఈ నెల 13న ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల బాధ్యులు కావడంతో సస్పెండ్ అయిన అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగులు వచ్చాయి.

AP Election 2024: సస్పెండ్ అయిన అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగులు

అమరావతి: ఈ నెల 13న ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల బాధ్యులు కావడంతో సస్పెండ్ అయిన అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగులు వచ్చాయి.


నరసరరావుపేట డీఎస్పీగా ఎం సుధాకర్ రావు, గురజాల డీఎస్పీగా సీహెచ్ శ్రీనివాసరరావు, తిరుపతి డీఎస్సీగా కే.రవి మనోహర్ చారి, తాడిపత్రి డీఎస్పీగా కే జనార్దన్ నాయుడు, తిరుపతి ఎస్‌బీగా ఎం వెంకట్రాది, పల్నాడు స్పెషల్ బ్రాంచ్ సీఐలుగా బీ.సురేష్ బాబు, యూ.శోభన్ బాబులు, కారంపూడి ఎస్‌ఐగా కే.అమీర్, నాగార్జున సాగర్ ఎస్ఐగా ఎం పట్టాభి, తిరుపతి ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌గా ఏ విశ్వనాథ్, అలిపిరి సీఐగా ఎం రామారావు, తాడ్రిపత్రి సీఐగా పీ.నాగేంద్ర ప్రసాద్‌లు నియామకం అయ్యారు.


ఈ అధికారులు అందరినీ తక్షణమే విధుల్లో చేరేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ డీజీపీకి ఎన్నికల కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురు అధికారుల పేనల్‌లో ఒకరిని ఎంపిక చేసి ఎన్నికల సంఘం పోస్టింగులు ఇచ్చింది. కాగా ఎన్నికల సమయంలో హింసాత్మక ఘటనలను అరికట్టలేకపోవడంతో మొత్తం 13 మంది పోలీసు అధికారులను ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

Updated Date - May 20 , 2024 | 03:26 PM

Advertising
Advertising