AP Election 2024: జగన్ కుయుక్తులకు కేంద్ర ఎన్నికల సంఘం చెక్
ABN, Publish Date - May 09 , 2024 | 12:02 PM
మరో నాలుగు రోజుల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024 (AP Election 2024) జరగనున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు జగన్ చేస్తున్న కుటీల ప్రయత్నాలకు కేంద్ర ఎన్నికల సంఘం చెక్ పెట్టింది. సంక్షేమ పథకాల పేరుతో పోలింగ్‌కు 2 రోజుల ముందు డబ్బులు పంపిణీ చేయాలనే ప్రయత్నాలను తిప్పికొట్టింది. సంక్షేమ పథకాల సొమ్ముల చెల్లింపునకు కేంద్ర ఎన్నికల సంఘం నో చెప్పింది.
అమరావతి: మరో నాలుగు రోజుల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024 (AP Election 2024) జరగనున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు వైసీపీ (YSRCP) అధినేత జగన్ (YS Jagan) చేస్తున్న కుటీల ప్రయత్నాలకు కేంద్ర ఎన్నికల సంఘం చెక్ పెట్టింది. సంక్షేమ పథకాల పేరుతో పోలింగ్‌కు 2 రోజుల ముందు డబ్బులు పంపిణీ చేయాలనే ప్రయత్నాలను తిప్పికొట్టింది. సంక్షేమ పథకాల సొమ్ముల చెల్లింపునకు కేంద్ర ఎన్నికల సంఘం నో చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్క్రీనింగ్ కమిటీ ద్వారా సుమారు రూ.14 వేల కోట్లకు పైగా పంపిణీకి ప్రతిపాదనలు వచ్చాయని, ఈ సొమ్ములు చెల్లిస్తే ఎన్నికల ప్రక్రియలోని సైలెంట్ పిరియడ్‌కు విఘాతం కలుగుతుందని ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది. ‘లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్’ దెబ్బతింటుందని వ్యాఖ్యానించింది.
ఆసరా స్కీమ్, వైఎస్సార్ కల్యాణమస్తు/వైఎస్సార్ షాదీ తోఫా, జగనన్న విద్యా దీవెన, రైతు పెట్టుబడి సాయం, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాలకు ఎన్నికలు ముగిసే వరకు నిధులు విడుదల చేయడానికి వీల్లేదని స్పష్టం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సర్క్యూలర్ జారీ చేసింది.
గత ఆరు నెలల నుంచి బటన్‌లు నొక్కినా ఎందుకు బదిలీ చేయలేదని వైసీపీ ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం ప్రశ్నించింది. అంతగా లబ్ధిదారులకు సొమ్ములు చెల్లించాలనుకుంటే ఈ నెల 13 తర్వాత బ్యాంకు ఖాతాల నుంచి లబ్దిదారులకు చెల్లించవచ్చునని సూచించింది. బటన్ నొక్కి ఐదారు నెలలు అవుతున్నా ఎందుకు ఆలస్యమవుతోందని ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది.
ఇవి కూడా చదవండి
ఎన్నికల వేళ రూ.8 కోట్లకుపైగా పట్టుబడిన నగదు
Read Latest Election News And Telugu News
Updated Date - May 09 , 2024 | 12:24 PM