ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Polls: బారామతిలో ఫ్యామిలీ వార్.. గెలుపు ఎవరిదంటే..?

ABN, Publish Date - May 08 , 2024 | 11:14 AM

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా.. మూడు విడతలు ఇప్పటికే ముగిశాయి. పోలింగ్ ముగిసిన మూడోవిడతలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం మహారాష్ట్రలోని బారామతి.. ఇక్కడ ఫ్యామిలీ వార్ నడుస్తుండగా.. విజయంపై ఉత్కంఠ నెలకొంది. ఎన్సీపీ, ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీల మధ్య ఈ నియోజకవర్గంలో ప్రధాన పోటీ నెలకొంది.

Pawar Family

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా.. మూడు విడతలు ఇప్పటికే ముగిశాయి. పోలింగ్ ముగిసిన మూడోవిడతలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం మహారాష్ట్రలోని బారామతి.. ఇక్కడ ఫ్యామిలీ వార్ నడుస్తుండగా.. విజయంపై ఉత్కంఠ నెలకొంది. ఎన్సీపీ, ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీల మధ్య ఈ నియోజకవర్గంలో ప్రధాన పోటీ నెలకొంది. ఎన్సీపీ నుంచి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్, ఎన్సీపీ(ఎస్పీ) నంచి శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే పోటీచేస్తున్నారు. గెలుపుపై ఇరుపార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈక్రమంలో పోలింగ్ వేళ అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన తల్లి ఆశా పవార్ తనతోనే ఉన్నారని చెప్పారు. దీనికి సంకేతంగా తనతో పాటు ఓటు వేసేందుకు తల్లి ఆశాపవార్‌తో కలిసి వచ్చారు. దీంతో పవార్ కుటుంబం మధ్య మరోసారి మాటల యుద్ధం ప్రారంభమైంది. మరోవైపు ఆశా పవార్ ఆశీస్సుల కోసం ఎన్సీపీ (ఎస్పీ) అభ్యర్థి సుప్రియా అజిత్ పవార్ ఇంటికి వెళ్లారు. దీంతో ఆశా పవార్ మద్దతు ఎవరికి అనే చర్చ మొదలైంది. దీంతో బారామతి లోక్‌సభ స్థానంలో ఎవరు గెలుస్తారనే చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది.

AIMIM: పది లోక్‌సభ స్థానాల్లో మజ్లిస్‌ పోటీ


పార్టీ చీలిక తర్వాత..

ఎన్సీపీ పార్టీ చీలిక తర్వాత పవార్ కుటుంబానికి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దూరమయ్యారు. దాదాపు వందమంది సభ్యులున్న పవార్ కుటుంబంలో ఎక్కువమంది శరద్ పవార్‌కే మద్దతు పలుకుతున్నారు. ఈనేపథ్యంలో అజిత్ పవార్ ఓటు వేసిన అనంతరం మాట్లాడుతూ.. మా కుటుంబంలో పెద్దది మా అమ్మ ఆశా పవార్.. మా అమ్మ నాతోనే ఉందని అన్నారు.


అత్యంత ప్రతిష్టాత్మకం..

బారామతి లోక్‌సభ నియోజకవర్గం పవార్ కుటుంబానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఎన్సీపీ పార్టీ చీలికతో పాటు పవార్ కుటుంబంలో చీలిక రావడంతో ఎక్కువమంది సుప్రియకు మద్దతు పలకడంతో పాటు ప్రచారం నిర్వహించారు. అజిత్ పవార్ సోదరుడు శ్రీనివాస్ పవార్ సుప్రియ తరపున ప్రచారం చేశారు. దీంతో అజిత్ పవార్ మా అమ్మ తనతోనే ఉందని చెప్పడంపై శ్రీనివాస్ పవార్ అజిత్‌ పవార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిని రాజకీయాల కోసం ఉపయోగించుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.

దీనిపై అజిత్ పవార్ స్పందిస్తూ.. అమ్మను ఓటు వేయడం కోసం పోలింగ్ బూత్ వద్దకు తీసుకొస్తే ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారంటూ ప్రశ్నించారు. మా అమ్మ నిన్న, ఈ రోజు నాతోనే ఉంది.. రేపు నాతో ఉంటుంది. నాన్న చనిపోయిన తర్వాత అమ్మకు నేను ఇచ్చిన సపోర్ట్ మరెవరూ ఇవ్వలేదు. దీని గురించి సన్నిహితులను అడిగితే ఎవరైనా చెబుతారని అన్నారు. దీంతో బారామతి నియోజకవర్గాన్ని శరద్ పవార్‌తో పాటు అజిత్ పవార్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనేది తెలుస్తోంది.


గతంలో ఎన్నడూ లేని విధంగా.

బారామతి నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా డబ్బు పంపిణీ జరిగిందనే ఆరోపణలు వినిపించాయి. దీనిపై అజిత్ పవార్ స్పందిస్తూ.. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తాను డబ్బు పంపిణీపై ఆధారపడలేదని, అలాంటి పని చేయలేదు.. ఎప్పటికీ చేయబోనన్నారు. ఎన్సీపీ(ఎస్పీ) వాళ్లే విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. తనపై ఏదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే ఎన్నికల సంఘం వద్దకు వెళ్లాలని, నిరధారమైన ఆరోపణలు చేయవద్దన్నారు. ఏది ఏమైనప్పటికీ తన తల్లి మాత్రం తనతోనే ఉన్నారని స్పష్టం చేశారు.


విజయంపై..

శరద్‌పవార్ కుమార్తె సుప్రియ బారామతి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. గత ఎన్నికల్లో పవార్ ఫ్యామిలీ మొత్తం కలిసి ఉండటంతో అక్కడ ఆ పార్టీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఎన్సీపీ రెండు వర్గాలుగా చీలిపోవడం, మరోవైపు శివసేనలోని ఓవర్గం, బీజేపీ అజిత్‌ పవార్‌కు మద్దతు ఇస్తుడంటంతో పోటీ రసవత్తరంగా మారింది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడం పార్టీతో పాటు.. శరద్‌ పవార్‌‌కు ప్రతిష్టాత్మకంగా మారింది. మరోవైపు సుప్రియకు కాంగ్రెస్‌తో పాటు శివసేనలో మరోవర్గం మద్దతు ఉండటంతో ఎవరూ గెలుస్తారనే అంశంలో క్లారిటీ రావడంలేదు. ఏది ఏమైనప్పటికీ హోరాహోరీ పోరులో ఎవరు బయటపడతారనేది జూన్4న తేలనుంది.


Patna: ముస్లింలందరికీ రిజర్వేషన్లు ఉండాలి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest National News and Telugu News

Updated Date - May 08 , 2024 | 11:14 AM

Advertising
Advertising