Blueberry Vs Amla: బ్లూ బెర్రీ లేదా ఉసిరి.. చర్మ ఆరోగ్యానికి ఏ పండు అద్భుతంగా పనిచేస్తుంది..
ABN , Publish Date - Oct 21 , 2024 | 01:44 PM
పండ్లు చర్మానికి చాలా మేలు చేస్తాయి. అయితే బ్లూ బెర్రీ, ఉసిరి రెండింటిలో ఏది మేలంటే
శరీరానికి చర్మం తొడుగు వంటిది. శరీరంలో ఏ అనారోగ్యం వచ్చినా మొదటగా చర్మం మీదనే దాని లక్షణాలు బయట పడుతుంటాయి. కనీసం నీరసంగా అనిపించినా సరే.. చర్మం వాడిపోయి, నిర్జీవంగా మారుతుంది. అయితే చర్మ ఆరోగ్యం విషయంలో కొన్ని రకాల పండ్లు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఇందుకోసమే వయసు పెరిగినా సరే యవ్వనంగా కనిపించడం కోసం ఆహార నిపుణులు, వైద్యులు పండ్లు బాగా తీసుకోమని చెబుతారు. అయితే చర్మ ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో బ్లూ బెర్రీ, ఉసిరి అగ్ర స్థానంలో ఉంటాయి. ఈ రెండింటిలో కూడా చర్మానికి ఏది బెస్ట్ అనే విషయం తెలుసుకుంటే..
Health Tips: జీడిపప్పు తింటే బరువు పెరుగుతారా లేక తగ్గుతారా.. అసలు నిజాలు ఇవీ..
బ్లూబెర్రీస్..
బ్లూబెర్రీస్ లో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి చిన్న పరిమాణంలో ఉన్నా వీటిలో పోషకాల కంటెంట్ మెండు. ఇందులో అధిక స్థాయిలో ఆంథోసైనిన్ లు ఉంటాయి. ఈ ఆంథోసైనిన్ లు బ్లూబెర్రీస్ కు నీలం రంగును అందిస్తాయి. ఇవి గొప్ప యాంటీ ఆక్సిడెంట్లు కూడా. శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించడంలో సహాయపడతాయి. వృద్దాప్యాన్ని అడ్డుకోవడంలో సహాయపడతాయి.
బ్లూబెర్రీస్ లో విటమిన్-సి, విటమిన్-కె మెండుగా ఉంటుంది. విటమిన్-సి కొల్లాజెన్ సంశ్లేషణకు కీలకం. ఇక విటమిన్-కె చర్మ స్థితిస్థాపకతను నిలిపి ఉంచుతుంది.
డైటరీ ఫైబర్ అధికంగా ఉండటం వల్ల బ్లూబెర్రీస్ జీర్ణ ఆరోగ్యానికి బాగా సహాయపడతాయి. పేగు ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి.
బ్లూబెర్రీస్ ను క్రమం తప్పకుండా తింటే చర్మం మీద ముడతలు, మచ్చలు, గీతలు తగ్గుతాయి.
నీటి శాతం అధికంగా ఉండటం వల్ల బ్లూబెర్రీస్ తింటే చర్మం హైడ్రేటెడ్ గా ఉంటుంది.
బ్లూబెర్రీస్ లో ఉండే విటమిన్-సి చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది. నల్ల మచ్చలు తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
బ్లూబెర్రీస్ లో ఉండే యాంటీఆక్సిడెంట్లు UV కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తాయి. సన్ బర్న్, చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
బ్లూబెర్రీస్ ను ఫేస్ మాస్క్ లు, ఫేస్ ప్యాక్ లలో వినియోగించవచ్చు. స్మూతీలు, జ్యూస్ లు లేదా తాజాగా తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
Arthritis: ఆర్థరైటిస్ సమస్యకు ఆయుర్వేదం చెప్పిన అదిరిపోయే చిట్కా..
ఉసిరి..
ఉసిరికి ఆయుర్వేదంలో చాలా ప్రధాన్యత ఉంది. ఉసిరిలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరం మొత్తం ఆరోగ్యానికి, కొల్లాజెన్ ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ కూడా.
ఉసిరిలో పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో వాపు, చర్మం, చర్మం చికాకులు తగ్గించడంలో సహాయపడతాయి.
ఉసిరిలో కాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి చాలా సహాయపడతాయి.
ఉసిరి వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది. మొటిమలు, తామర, సొరియాసిస్ వంటి చర్మ వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఉసిరి తీసుకుంటే కాలేయ పనితీరు మెరుగవుతుంది. కాలేయ పనితీరు బాగుంటే చర్మం కూడా క్లియర్ గా ఉంటుంది. చర్మం పగుళ్లు, మచ్చలు తగ్గుతాయి.
ఉసిరి పొడిని ఫేస్ ప్యాక్ గా ఉపయోగించవచ్చు. తాజా ఉసిరి రసానికి రోజ్ వాటర్ జోడించి టోనర్ గా వాడవచ్చు. ఇక ఉసిరిని ఆహారంలో బాగం చేసుకోవచ్చు. జ్యూస్ గా కూడా తీసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి..
జింక్ అధికంగా ఉన్న వెజిటేరియన్ ఆహారాల గురించి తెలుసా?
ఆడవాళ్ళు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇవి..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.