Share News

పకడ్బందీగా యూపీఎస్సీ పరీక్షలు

ABN , Publish Date - Apr 12 , 2025 | 01:21 AM

ఈనెల 13న నిర్వహించనున్న నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమి (ఎన్‌డీఏ), నావెల్‌ అకాడమి (ఎన్‌ఏ), కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ (సీడీఎస్‌) పరీక్షలను సూక్ష్మ పర్యవేక్షణలో నిర్వహించాలని, ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా అవసరమైన ఏర్పాట్లను చేపట్టాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.

పకడ్బందీగా యూపీఎస్సీ పరీక్షలు
పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ లక్ష్మీశ

వన్‌టౌన్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి) : ఈనెల 13న నిర్వహించనున్న నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమి (ఎన్‌డీఏ), నావెల్‌ అకాడమి (ఎన్‌ఏ), కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ (సీడీఎస్‌) పరీక్షలను సూక్ష్మ పర్యవేక్షణలో నిర్వహించాలని, ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా అవసరమైన ఏర్పాట్లను చేపట్టాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యుపిఎ్‌ససి) ద్వారా నిర్వహించే పరీక్షల నిర్వహణపై శుక్రవారం కలెక్టరేట్‌లో లైజన్‌ ఆఫీసర్లు, వెన్యూ సూపర్‌వైజర్‌లు, లైజన్‌ కమ్‌ ఇన్‌స్పెక్టింగ్‌ అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడతూ, ఈనెల 13న ఎన్డీఏ, ఎన్‌ఏ, సీడీఎస్‌ పరీక్షలను యూపీఎస్సీ నిర్వహిస్తుందని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 1,791 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని, వీరిలో సీడీఎ్‌సకు 577 మంది, ఎన్డీఏ, ఎన్‌ఏ పరీక్షలకు 1,214 మంది హాజరు కానున్నట్టు చెప్పారు. ఆరు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఎన్డీఏ, ఎన్‌ఏ పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉంటుందన్నారు. సీడీఎప్‌ పరీక్షలు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు జరుగుతాయని చెప్పారు. పరీక్షల నిర్వహణకు 170 మంది ఇన్విజిలేటర్లు, ఆరుగురు వెన్యూ సూపర్‌వైజర్లు, ఆరుగురు లైజన్‌ అధికారులను నియమించినట్టు చెప్పారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు 30 నిమిషాలకు ముందుగానే చేరుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. స్టేట్‌ అబ్జర్వర్‌ కె.ప్రశాంతకుమార్‌, యూపీఎస్సీ అబ్జర్వర్‌ ఎన్‌.రాజేశ్వరరావు, బీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహం, చీఫ్‌ సూపరింటెండెంట్లు, లైజన్‌ ఆఫీసర్లు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2025 | 01:21 AM