Child Health Care: మీ పిల్లలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి..!
ABN, Publish Date - Jul 26 , 2024 | 11:57 AM
Dengue Symptoms and Prevention Tips: వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. తద్వారా వ్యాధులు కూడా పెరుగుతాయి. అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల్లో డెంగ్యూ ఒకటి. ఈ డెంగ్యూ అన్ని వయసుల వారికి వచ్చే అవకాశం ఉంది. చిన్న పిల్లలు మొదలు.. ముసలి వాళ్ల వరకు..
Dengue Symptoms and Prevention Tips: వర్షాకాలం వచ్చిందంటే చాలు.. అనేక రకాల సీజన్ వ్యాధులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. అనేక రకాల బ్యాక్టీరియా, వైరల్ ఇన్‌ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ సీజన్‌లో సాధారణ వ్యాధులతో పాటు.. దోమల కారణంగా వచ్చే వ్యాధులు కూడా చాలా ఎక్కువే. వీటిలో డెంగ్యూ ప్రమాదకరమైన వ్యాధి. కొన్ని సందర్భాల్లో, డెంగ్యూ మరణాలకు దారితీస్తుంది. ఈ వ్యాధి కారణంగా ప్రతి సంవత్సరం వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. వర్షాల సమయంలో వరదలు ముంచెత్తుతాయి. వరద నీరు నిలిచిపోవడం, మురుగు నీరు నిల్వ ఉండటం, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం కారణంగా.. దోమలు వృద్ధి చెందుతాయి. ఈ దోమ కాటు కారణంగానే ప్రజల్లో డెంగ్యూ వ్యాధి వస్తుంది. ఇది వచ్చిన వ్యక్తుల్లో బ్లడ్ ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గి.. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారే ప్రమాదం ఉంటుంది.
డెంగ్యూ అనేది వైరల్ ఫీవర్. ఏడిస్ దోమ ఒక వ్యక్తిని కుట్టినప్పుడు.. ఈ వైరస్ వ్యక్తికి వ్యాపిస్తుంది. వర్షాకాలంలో డెంగ్యూ దోమలు వృద్ధి చెందుతాయి. వర్షాకాలంలో వచ్చే బురద, నిల్వ ఉన్న నీరు.. ఈ దోమల వృద్ధికి కారణం. అందుకే ఈ సీజన్‌లో డెంగ్యూ కేసులు భారీగా పెరుగుతాయి. అందుకే ఈ సీజన్‌లో ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. పెద్దల ఆరోగ్యంతో పాటు.. పిల్లల ఆరోగ్యం విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి.
డెంగ్యూ లక్షణాలేంటి?
వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. పిల్లల్లో డెంగ్యూ సాధారణ లక్షణాల్లో జ్వరం ఒకటి. ఇది ఒక వారం రోజుల పాటు ఉంటుంది. ఈ జ్వరం అకస్మాత్తుగా వస్తుంది. కండరాలు, తలనొప్పి ఉంటుంది. కొంతమంది పిల్లల్లో చిగుళ్లు, ముక్కు నుంచి రక్తస్రావం అవుతుంది. ఇది డెంగ్యూ తీవ్రమైన లక్షణం. చర్మంపై దద్దుర్లు కూడా వస్తాయి. డెంగ్యూ లక్షణాలను పిల్లల్లో సులభంగా గుర్తించవచ్చు. లక్షణాలు కనిపించిన వెంటనే పిల్లలను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాలి.
డెంగ్యూ బారిన పడకుండా ఏం చేయాలి?
👉 వర్షాకాలంలో పిల్లలను బయటికి పంపొద్దు.
👉 పిల్లలకు ఫుల్ స్లీవ్ దుస్తులు వేయాలి.
👉 దోమల నివారణ మందు వాడండి.
👉 కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి.
👉 ఇంటి పరిసరాల్లో నీటి నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి.
👉 దోమలకు కుట్టకుండా మార్కెట్‌లో అనేక రకాల క్రీమ్స్ ఉంటాయి. వాటిని వినియోగించాలి.
Also Read:
Nutmeg: మీ చర్మం నిగారింపు తగ్గిందా? ఇది ట్రై చేస్తే రిజల్ట్ పక్కా!
Health Tips: ఈ ఆహారాలు తిన్నారంటే.. కీళ్ల నొప్పులు తగ్గడమే
Viral: ఫ్రిజ్‌లో నిల్వ చేసిన ఫ్రోజన్ ఫుడ్స్ తింటారా?
For More Health News and Telugu News..
Updated Date - Jul 26 , 2024 | 11:57 AM