ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Snake Bite: పాముకాటు ప్రభావాన్ని తగ్గించే మెుక్కలు గురించి తెలుసా..

ABN, Publish Date - Dec 23 , 2024 | 07:09 AM

పాములు అత్యంత శక్తమంతమైన విషాన్ని కలిగి ఉంటాయి. సర్పాలు తమ విషాన్ని ఆహారం, శత్రువులను చంపేందుకు వినియోగిస్తుంటుంది. ఆయా దేశాలు, ప్రాంతాన్ని బట్టి వివిధ రకాల విష సర్పాలు కనిపిస్తుంటాయి. దేశం, ప్రాంతం, జాతి, ఆహారాన్ని బట్టి పాముల విషంలోనూ అనేక తేడాలు ఉంటాయి.

Snake Bite

ఇంటర్నెట్ డెస్క్: పాములు ఎంత ప్రమాదకరమో అందరికీ తెలిసిందే. పాముల్లో కొన్ని విషసర్పాలు ఉంటే మరికొన్ని విషరహిత సర్పాలు ఉంటాయి. సైన్స్ అభివృద్ధి చెందిన తర్వాత లక్షలు, కోట్ల మంది ప్రజలు పాముకాటుకు సరైన చికిత్స తీసుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే సైన్స్ అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో ముఖ్యంగా భారతదేశం లాంటి దేశాల్లో పాముకాటుకు విరుగుడుగా అనేక రకాల మెుక్కలను వినియోగించేవారు. నాటు వైద్యులు కొన్ని రకాల ఆకులను మెత్తగా నూరి పసరుకట్టు వేసేవారు. అలాగే ఆయా దేశాల వారు వివిధ రకాల ఆకులతో సంప్రదాయ చికిత్సలు చేసేవారు. అయితే దాని ద్వారా ప్రాణాలు నిలుస్తాయని చెప్పలేం. ఇప్పటికీ సరైన వైద్య సదుపాయం లేని అనేక దేశాలు, గిరిజన ప్రాంతాల్లో కొన్ని రకాల ప్రత్యేకమైన ఆకులతో పాముకాటు నుంచి ప్రాణాలు కాపాడుకోవచ్చని నమ్ముతారు. అయితే దీన్ని ఇంతవరకూ ఎవ్వరూ శాస్త్రీయంగా నిరూపించలేదు. అయితే రెండు రకాల మెుక్కలు మాత్రం పాముకాటు ప్రభావాన్ని తగ్గిస్తాయని చెప్పొచ్చు.


పాములు అత్యంత శక్తమంతమైన విషాన్ని కలిగి ఉంటాయి. సర్పాలు తమ విషాన్ని ఆహారం, శత్రువులను చంపేందుకు వినియోగిస్తుంటుంది. ఆయా దేశాలు, ప్రాంతాన్ని బట్టి వివిధ రకాల విష సర్పాలు కనిపిస్తుంటాయి. దేశం, ప్రాంతం, జాతి, ఆహారాన్ని బట్టి పాముల విషంలోనూ అనేక తేడాలు ఉంటాయి. అయితే ఈ విష ప్రభావాన్ని రెండు రకాల మెుక్కలు తగ్గిస్తాయి. వాటిలో మెుదటిది, బోడ కాకరకాయ మొక్క. ఈ మెుక్క సాధారణంగా వేడి, తేమ ప్రదేశాల్లో కనిపిస్తుంటుంది. బోడకాకరకాయల రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. వీటి రేటు సైతం రూ.200 వరకూ పలుకుతుంది. వీలైనప్పుడల్లా వీటిని తరచూ తినడం మంచిది.


పాము విష ప్రభావాన్ని తగ్గించే మెుక్కల్లో గరుడ మెుక్క రెండోది. ఇది కూడా పాముకాటు ప్రభావాన్ని తగ్గిస్తుంది. అయితే ఈ రెండు మెుక్కలను పాముకాటుకు పూర్తి విరుగుడుగా చెప్పలేం. వీటిని విష సర్పాల కాటుకు చికిత్సగా వాడడం వల్ల పూర్తిగా నయం అవుతుందనే ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అందుకే పాము కాటు వేసిన వెంటనే వైద్యుడి సంప్రదించాలి. అలాంటి సందర్భాల్లో బాధితుడు కంగారు పడకూడదు. కంగారు పడితే విషం వేగంగా శరీరంలోకి పాకే అవకాశం ఉంటుంది. కదలకుండా భయపడకుండా ఉండాలి. వీలైనంత వేగంగా ఏదైనా వాహనం ద్వారా వైద్యుడి వద్దకు చేరుకోవాలి. సరైన సమయంలో చికిత్స తీసుకుని ప్రాణాలు కాపాడుకోవాలి.

Updated Date - Dec 23 , 2024 | 07:10 AM