ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chicken Bones: మీరు చికెన్ బోన్స్ తింటారా? అయితే జర భద్రం..

ABN, Publish Date - Aug 05 , 2024 | 08:45 AM

వీకెండ్ వచ్చిందంటే చాలు మాంసాహార ప్రియులకు పండగే. చికెన్, మటన్, ఫిష్‌లతో లాగించేస్తుంటారు. కొంతమంది ఇంట్లో వండుకుని తింటే.. మరికొంతమంది హోటళ్లలో బిర్యానీలు లొట్టలేసుకుని మరీ తింటుంటారు. చిన్నపెద్ద తేడా లేకుండా ఎక్కువ మంది ఇష్టపడేది చికెన్. కొందరయితే చికెన్ తినేప్పుడు బోన్స్‌ని కూడా నమిలి మింగేస్తుంటారు. అయితే చికెన్ ఎముకలు తినడం మంచిదేనా. తింటే నాటు కోడు మంచిదా లేక బ్రాయిలర్ కోడివా? ఇప్పుడు తెలుసుకుందాం..

నాటు కోడి బోన్స్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు..

నాటుకోడి ఎముకలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎముక మజ్జలో కొల్లాజెన్, కంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్, గ్లైసిన్, గ్లూకోసమైన్‌ వంటి అనేక ఆరోగ్య-ప్రోత్సాహక సమ్మేళనాలు ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అలాగే కీళ్ల పనితీరుకు బాగా మెరుగుపరుస్తాయి. కీళ్ల వాపులు, నొప్పులు ఉన్నవారు ఇవి తింటే ఉపశమనం లభిస్తుంది. బోన్ మ్యారోలో విటమిన్-A, B, B1, B5, B7, జింక్, ఐరన్, కాల్షియం, సెలీనియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీవక్రియ, శక్తి మార్పిడికి ఎంతో దోహదపడతాయి.

బ్రాయిలర్ కోళ్ల బోన్స్ జోలికి పోవొద్దు..

నాటుకోడి చికెన్ బోన్స్ మంచిదే అయితే బ్రాయిలర్ కోళ్ల చికెన్ ఎముకలు మాత్రం తినకూడదు. వీటి మూలుగ తింటే డేంజర్ అని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఎందుకంటే ఇవి త్వరగా పెరిగేందుకు ఇంజక్షన్లు వేస్తారు. దాని ప్రభావం కోళ్ల బోన్స్‌పై ఉంటుంది. వీటిని తినడం వల్ల మానవ శరీరానికి ప్రమాదం పొంచి ఉందని అనేక మంది శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతున్నారు. క్యాన్సర్‌తోపాటు పలు రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇంజక్షన్లు వేసిన బ్రాయిలర్ కోడి ఎముకల కంటే నాటుకోడి బోన్స్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

Updated Date - Aug 05 , 2024 | 08:45 AM

Advertising
Advertising
<