Health: కదలరు.. నడవరు.. తగ్గిన శారీరక శ్రమతోనే ముప్పు
ABN, Publish Date - Nov 14 , 2024 | 10:20 AM
ఆధునిక జీవన విధానం, కదలికలేని ఉద్యోగాలు, ఫాస్ట్‌ఫుడ్(Jobs, Fast Food), మానసిక ఒత్తిడిలు మధుమేహాన్ని పెంచడానికి కారణమవుతున్నాయని అంటున్నారు వైద్యులు. కార్పొరేట్ ఉద్యోగంలో శరీరానికి ఎక్కువగా పనులు చెప్పకపోవడం, సరైన వ్యాయమం లేకపోవడం, వర్క్‌ఫ్రమ్ హోమ్‌లో ఉంటే సోఫా నుంచి కిందకు దిగడం లేదు.
- పెరుగుతున్న మధుమేహ వ్యాధిగ్రస్తులు
- నేడు వరల్డ్ డయాబెటిస్ డే
హైదరాబాద్ సిటీ: ఆధునిక జీవన విధానం, కదలికలేని ఉద్యోగాలు, ఫాస్ట్‌ఫుడ్(Jobs, Fast Food), మానసిక ఒత్తిడిలు మధుమేహాన్ని పెంచడానికి కారణమవుతున్నాయని అంటున్నారు వైద్యులు. కార్పొరేట్ ఉద్యోగంలో శరీరానికి ఎక్కువగా పనులు చెప్పకపోవడం, సరైన వ్యాయమం లేకపోవడం, వర్క్‌ఫ్రమ్ హోమ్‌లో ఉంటే సోఫా నుంచి కిందకు దిగడం లేదు. తరచూ ఏదో ఒకటి తినడం వల్ల మధుమేహం(Diabetes) చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఆల్కహాల్, పొగతాగడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయి పెరుగుతోంది. ఐటీ ఉద్యోగుల్లో మధుమేహం ఎక్కువగా కనిపిస్తుండగా, సాధారణ ఉద్యోగుల్లో 30 ఏళ్ల లోపే మధుమేహం బారిన పడుతున్నట్లు వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: GHMC: ఐఏఎస్‌లు వర్సెస్ ఇంజనీర్లు..
ఒక్కో వైద్యుడి ఓపీలో 40 శాతం మంది
ఒక్కొక్క వైద్యుడి ఓపీలో 40 శాతం మంది మధుమేహ బాధితులుంటున్నారని వైద్యులు వివరిస్తున్నారు. ఇందులో 20 నుంచి 30 శాతం మంది ఐటీ ఉద్యోగులే ఉంటున్నారని చెబుతున్నారు. 13 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్సు గల వారిలో 20 శాతం, 20 నుంచి 30 వయస్సు ఉన్న వారిలో 30 శాతం, 30 నుంచి 40 వయస్సున్న వారిలో 40 శాతం, 40 కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారిలో 50 శాతం కంటే మించి మధుమేహంతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. గతంలో ఓ పార్మా కంపెనీ నిర్వహించిన సర్వేలో కూడా యువతలో ఎక్కువగా మధుమేహం ఉన్నట్లు తేలింది. 1900 మందిని సర్వే చేయగా.. యువత 25 శాతానికి మించి మధుమేహంతో బాధపడుతున్నట్లు, 43 శాతం మంది ఈ వ్యాధిగ్రస్తులు కిడ్నీ బాధితులున్నట్లు తెలిసింది.
అధిక శాతం ఉద్యోగుల్లో..
కార్పొరేట్ ఉద్యోగం చేసే వారికి డయాబెటిస్ శాపంగా మారిందని అంటున్నారు వైద్యులు. కంప్యూటర్, ఇంటర్నెట్‌తో ఎక్కువసేపు పనిచేసేవారు, డెస్క్‌వర్క్, ఏసీలో అధిక సమయం గడిపే వారికి మధుమేహం పొంచి ఉందంటున్నారు. కొన్ని కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగులను పరీక్షించగా సగానికంటే ఎక్కువ మందికి మధుమేహం ఉన్నట్లు తేలిందన్నారు. కదలికలేని శరీరంలో ఇన్సులెన్స్ రెసిటెన్సీ పెరుగుతుందని, తద్వారా మధుమేహం వచ్చే ప్రమాదముందని తెలిపారు.
ఈ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలి
అలసట, విపరీతంగా దాహం వేయడం, ఆకలి ఎక్కువగా ఉంటే అప్రమత్తంగా ఉండాలి. తరచూ మూత్రం రావడం, ఏకాగ్రత లోపించడం, ఎక్కువగా నీరు తాగడం, దెబ్బలు తగిలినచోట గాయం మానకపోవడం, చిరాకు వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పిల్లలు నిద్రలో మూత్ర విసర్జన, బరువు కోల్పోవడం, నీరసంగా ఉండడం, వణకడం వంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలి.
ఇతర అవయాలకు ప్రమాదం
మధుమేహం ఉంటే కిడ్నీ, కళ్లు, గుండె, రక్తనాళాలు, కాళ్లు, చేతులు ఎక్కువగా దెబ్బతింటాయంటున్నారు. మధమేహం ఉన్న వారిలో చిగుళ్ల వ్యాధులు వస్తాయని, దవడ ఎముకకి ఇన్‌ఫెక్షన్ సోకుతుందని, నోట్లో బ్యాక్టీరియా ఎక్కువవుతుందన్నారు.
ప్రాసెస్ ఆహారంతో ముప్పు
చాక్‌లెట్లు, క్రీమ్ బిస్కెట్లు, ప్రాసెస్ ఫుడ్‌లో అలా్ట్రప్రాసెస్ షుగర్ ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఇలాంటి ఆహార పదార్థాలు తినడం వల్ల 50లో రావాల్సిన మధుమేహం 20 వయస్సులోనే వస్తుంది. చాలామంది డబుల్ ప్రాసెస్ బియ్యం తింటున్నారు. అందులో పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇలాంటి అన్నం తినడం వల్ల త్వరగా మధుమేహం బారిన పడుతున్నారు. ప్రస్తుతం దంపడు బియ్యం తినడం లేదు. ప్రాసెస్ బియ్యానికి ఎక్కువగా అలవాటు పడుతున్నారు. అలవాటు కోసం మొదట సింగిల్ ప్రాసెస్ బియ్యం, రెండు నెలల తర్వాత పాలిస్ బియ్యం తినాలి. ఆ తర్వాత బ్రౌన్ రైస్ అలవాటు చేసుకోవాలి. జీవన శైలి మార్పు అనేది శాశ్వత్మంగా ఉండాలి. తప్పనిసరిగా 15 నిమిషాలు వ్యాయామం చేయాలి. చెమట పడితేనే మంచిది. చపాతీకి బదులు జొన్నరొట్టె తినాలి. ఇడ్లీ, రాగి, జొన్న పిండి కలిపి చేసుకోవాలి. పెసరట్టు తినాలి. తెల్ల ఉప్మా తినొద్దు, పొట్టుతో ఉన్న పప్పులు తినాలి. బ్రౌన్ బ్రెడ్ మంచిది కాదు.
- డాక్టర్ టీఎన్‌జే రాజేష్,
సీనియర్ ఇంటర్ననల్ మెడిసిన్, డయాబెటాలజిస్టు
కొత్త కేసులు పెరుగుతున్నాయి
మధుమేహానికి సంబంధించి కొత్త కేసులు పెరుగుతున్నాయి. 20 నుంచి 30 ఏళ్ల వారు ఎక్కువగా ఉంటున్నారు. ఓపిలో 5 నుంచి 10 శాతం మంది, ఆస్పత్రికి వచ్చే వారిలో 20 నుంచి 40 ఏళ్ల లోపు ఉంటున్నారు. బలహీనంగా ఉండి, మూత్రం ఎక్కువగా వస్తుంటే పరీక్షలు చేయించుకోవాలి. మధుమేహం నియంత్రణలో లేకపోతే న్యూరోపతి, కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. డయాబెటిక్ వల్ల గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. పీసీఓడీ సమస్య వల్ల మధుమేహం ఇబ్బందులు ఉంటున్నాయి. ప్రతి ఏడుగురి శిశువుల్లో ఒకరు పుట్టక సమయంలోనే గెస్టేషనల్ డయాబెటీస్ మెల్లిట్‌స(జీడీఎం) ప్రభావానికి లోనవుతున్నారు.
- డాక్టర్ స్మితనల్లా,
ఎండోక్రైనాలజిస్టు, కిమ్స్ ఆస్పత్రి
ఈవార్తను కూడా చదవండి: KTR: కొడంగల్ నుంచే రేవంత్ భరతం పడతాం
ఈవార్తను కూడా చదవండి: దాడిని ప్రోత్సహించిన వారిని వదిలిపెట్టం
ఈవార్తను కూడా చదవండి: తండ్రిని పట్టించుకోని కొడుక్కి తగిన శాస్తి
ఈవార్తను కూడా చదవండి: రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారు
Read Latest Telangana News and National News
Updated Date - Nov 14 , 2024 | 10:20 AM