Hairloss: జుట్టూడిపోతోందా? ఈ లిమిట్ దాటనంత వరకూ టెన్షన్ వద్దు!
ABN , Publish Date - Nov 17 , 2024 | 08:23 PM
నెత్తిపై వెంట్రుకలు ప్రతి రోజూ ఊడిపోతునే ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. శిరోజాల ఎదుగుదలలో ఇదో భాగమని వివరిస్తున్నారు. అయితే, ఓ పరిమితి దాటితే మాత్రం కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి. మరి ఈ పరిమితి ఏంటో? రోజుకు సహజనంగా ఎన్ని వెంట్రుకల వరకూ రాలిపోయే అవకాశం ఉందో చూద్దాం
ఇంటర్నెట్ డెస్క్: జుట్టూడిపోతోందంటే చాలు యువతకు గుండె దడ వచ్చేస్తుంది. టెన్షన్ పీక్స్‌కు చేరుతుంది. జీవితం తలకిందులైపోతోందని వణికిపోతారు. ఈ ఆందోళన అర్థం చేసుకోదగినదే అయినా నెత్తిపై వెంట్రుకలు ప్రతి రోజూ ఊడిపోతునే ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. శిరోజాల ఎదుగుదలలో ఇదో భాగమని వివరిస్తున్నారు. అయితే, ఓ పరిమితి దాటితే మాత్రం కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి. మరి ఈ పరిమితి ఏంటో? రోజుకు సహజనంగా ఎన్ని వెంట్రుకల వరకూ రాలిపోయే అవకాశం ఉందో చూద్దాం (Health).
Health: వేడి నీటి స్నానాలతో ఈ సమస్యలు ఉన్నాయని తెలుసా?
వైద్యులు చెప్పే దాని ప్రకారం, వెంట్రుకల ఎదుగుదలకు కొన్ని దశలు ఉంటాయి. చివరి దశలో అవి కుదుళ్ల నుంచి విడివడి రాలిపోతాయి. ప్రతి రోజూ కొన్ని శిరోజాలు నేలరాలిపోవడం సాధారణమే. చాలా సందర్భాల్లో జనాలు ఇది గమనించరు కూడా. జుట్టు దువ్వుకునేటప్పుడు లేదా తలస్నానం చేసేటప్పుడు మాత్రం దువ్వెన్నకో లేదా చేతికో అంటుకుని కనిపించే వెంట్రుకలను చూసి చాలా మంది కంగారు పడిపోతుంటారు. నిపుణులు చెప్పే దాని ప్రకారం, రోజుకు సగటున 50 నుంచి 100 వెంట్రుకలు ఊడిపోవడం సహజమే. ఈ పరిమితి దాటితే మాత్రం కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి. దీంతో పాటు ప్రతి రోజు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే జుట్టు రాలిపోవడాన్ని చాలా వరకూ అరికట్టొచ్చు.
Health: రాత్రి లేటుగా నిద్రపోయి మర్నాడు తెల్లవారుజామునే లేస్తున్నారా! అయితే..
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
జుట్టుపై సున్నితమైన ప్రభావం చూపించే షాంపూలతో మాత్రమే తలస్నానం చేయాలి. లేకపోతే జుట్టు త్వరగా పొడిబారి సులువుగా రాలిపోతుంది. వేడి నీటి స్నానంతో జుట్టు కుదుళ్ల మొదలు భాగం తెరుచుకుని జుట్టు రాలిపోతుంది. కాబట్టి, సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటితో తల స్నానం చేయడమే మంచిది. జుట్టు చిక్కుపడే అవకాశం ఎక్కువగా ఉన్నవారు ముందుగా చిక్కు తీసుకుని స్నానం చేస్తే వెంట్రుకలు రాలే అవకాశం తగ్గుతుంది.
నెత్తిపై బలంగా రుద్దకుండా సున్నితంగా వేళ్లతో రుద్దుకుంటే వెంట్రుకలు రాలిపోవు. స్నానం తరువాత కండీషనర్ వాడితే వెంట్రుకలు చిక్కు పడకుండా ఉంటాయి. ఫలితంగా అవి రాలిపోయే అవకాశాలు తగ్గుతాయి. ఇక జుట్టు దువ్వుకునేందుకు వెడల్పాంటి పళ్లున్న దువ్వెన్నలనే వాడాలి. లేకపోతే వెంట్రులపై ఒత్తిడి పెరిగి అధిక సంఖ్యలో రాలిపోతాయి. ఇక జుట్టు ఆరబెట్టుకునేందుకు బ్లో ఎయిర్ డ్రయర్లు, జుట్టు ఉంగరాలు తిప్పే కర్లింగ్ వాండ్స్ వంటి పరికరాలకు ఎంత దూరంగా ఉంటే జుట్టు రాలడం అంత తక్కువగా ఉంటుంది.
Beer: బీర్ తాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి! లేకపోతే..