Onion Benefits: ఉల్లిపాయలతో లైంగిక సామర్థ్యం.. ఈ రహస్యాలు తెలుసా..
ABN, Publish Date - Dec 30 , 2024 | 08:06 AM
ఆధునిక ప్రపంచంలో యువత విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవుతోంది. ఉద్యోగ, కుటుంబ, ఆర్థిక సమస్యలతో యువకులు సతమతమవుతున్నారు. దీంతో వారు ఆరోగ్యంపై పూర్తిగా శ్రద్ధ కోల్పోతున్నారు. ముఖ్యంగా ఇలాంటి వారిలో లైంగిక ఆసక్తి తగ్గుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. అది నిజమే.. అందుకే మన పెద్దలు ఉల్లిపాయలు గురించి అంత గొప్పగా చెప్పారు. జుట్టు నుంచి గుండె ఆరోగ్యం వరకూ ప్రతి దానికి ఉల్లి ఎంతో మేలు చేస్తుంది. ప్రతి కూరలోనూ దాన్ని వినియోగించడం భారతీయులకు సంప్రదాయంగా మారిపోయింది. ఉల్లి లేనిదే కూర చేయరంటే అతిశయోక్తి కాదు. అందుకే ఉల్లి రేట్లు పెరిగితే ప్రజల కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. అలాంటి ఉల్లిపాయల వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆధునిక ప్రపంచంలో యువత విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవుతోంది. ఉద్యోగ, కుటుంబ, ఆర్థిక సమస్యలతో యువకులు సతమతమవుతున్నారు. దీంతో వారు ఆరోగ్యంపై పూర్తిగా శ్రద్ధ కోల్పోతున్నారు. ముఖ్యంగా ఇలాంటి వారిలో లైంగిక ఆసక్తి తగ్గుతోంది. ఎప్పుడూ టెన్షన్ పడుతూ ఆందోళనకు గురికావడంతో వీర్యకణాల సంఖ్యా తగ్గిపోతోంది. దీంతో పిల్లలు పుట్టడం కష్టంగా మారిపోతోంది. అందుకే ప్రస్తుతం సంతాన సాఫల్య కేంద్రాలు పుట్టలుపుట్టలుగా పుట్టుకొస్తున్నాయి.
లైంగిక సామర్థ్యం..
ఉల్లిపాయలు ఎక్కువగా తినేవారిలో లైంగిక సామర్థ్యం పెరుగుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఉల్లిని రసంగా చేసి అందులో అల్లం కలిపి తాగితే లైంగిక శక్తి పెరుగుతుందని డైటీషియన్లు సూచిస్తున్నారు. దీనిలో లైంగిక కోరికలను ప్రభావితం చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జననేంద్రియాల ఆరోగ్యానికి సైతం ఉల్లిపాయలు ఎంతో మేలు చేస్తాయి. అందుకే లైంగిక సమస్యలు ఉన్నవారు రోజూ కాస్త ఎక్కువగా ఉల్లిని తింటే ప్రయోజనం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
సంతాన సమస్యకు పరిష్కారం..
ప్రస్తుతం చాలా మంది యువకుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గి పిల్లలు పుట్టడం కష్టంగా మారింది. అయితే ఇలాంటి యువకులు ఉల్లి రసంలో తేనె కలిపి తాగితే ప్రయోజనం ఉంటుంది. ఉల్లి రసానికి తేనె జోడించి తాగితే వీర్యకణాల సంఖ్య వృద్ధి చెందుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అలాగే వెన్నె కలిపిన ఉల్లిపాయల పేస్టు తింటే లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. అందుకే సంతాన సమస్యలు ఎదుర్కొంటున్న యువకులు ఉల్లిపై ఓ లుక్ వేయడం మంచిది.
ఇతర ప్రయోజనాలు..
ఉల్లిపాయలు జీర్ణ ప్రక్రియను మెరుగుపరిచి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడతాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచి షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉండేందుకు తోడ్పడతాయి. రోగ నిరోధకశక్తిని పెంచేందుకు, కళ్ల అలర్జీ తగ్గించేందుకు సహాయపడతాయి. అలాగే జలుబు, దగ్గు సహా గొంతు సమస్యల నివారణకు ఇవి సహాయం చేస్తుంది. ఇక ఉల్లిపాయలతో బీపీని సైతం కంట్రోల్ చేయవచ్చు. కాబట్టి తరచుగా ఉల్లిపాయలు తినడం మంచిది.
Updated Date - Dec 30 , 2024 | 09:21 AM