Apples: ఈ టిప్స్ ఫాలో అయితే.. యాపిల్ ముక్కలు కట్ చేసిన తరువాత రంగు మారవు..
ABN, Publish Date - Nov 06 , 2024 | 09:29 PM
యాపిల్ పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కానీ వాటిని ముందుగానే ముక్కలు కోస్తే నల్లగా మారిపోతాయి. అలా జరగకూడదంటే ఈ టిప్స్ బాగా హెల్ప్ అవుతాయి.
ఇంటర్నెట్ డెస్క్: యాపిల్ పండ్లకు వైద్య శాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఉంది. రోజుకు ఒక యాపిల్ తింటే వైద్యుడి అవసరమే ఉండదని అంటారు. ఎవరైనా రక్త దానం చేయగానే యాపిల్ పండు తినమని ఇస్తుంటారు. దీన్ని బట్టి యాపిల్ పండు శరీరాన్ని ఎంత శక్తివంతంగా ఉంచుతుందో అర్థం చేసుకోవచ్చు. అయితే కొందరికి యాపిల్ పండును అప్పటికప్పుడు కట్ చేసి తినడానికి వీలుండదు. అందుకే చాలా వరకు యాపిల్ ను ముక్కలుగా కట్ చేసి టిఫిన్, లంచ్ బాక్స్ లో పట్టుకెళ్తుంటారు. వీటిని స్నాక్స్ టైం లో తినమని చెబుతుంటారు. కానీ ఇలా చేస్తే యాపిల్ ముక్కలు తినే సమయానికి నల్లగా మారిపోతాయి. ఇలా రంగు మారిన యాపిల్ ను తినాలన్నా తినబుద్ది కాదు. ఇక అట్రాక్షన్ గా కనిపిస్తే తినలేని చిన్నపిల్లలు ఇలాంటి యాపిల్ ముక్కలను సింపుల్ గా డస్ట్ బిన్ లో కూడా వేసేస్తారు. అలా కాకుండా యాపిల్ ముక్కలు కట్ చేసిన చాలా సేపటి వరకు రంగు మారకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి.
ఒక కప్పు నీళ్లలో కొంచెం ఉప్పు వేయాలి. యాపిల్ ముక్కలు కట్ చేసిన తరువాత ఆ ముక్కలను వెంటనే ఉప్పు కలిపిన నీటిలో వేయాలి. కొన్ని నిమిషాలు వాటిని అలాగే ఉంచి ఆ తరువాత బయటకు తీసి వాటిని బాక్స్ పెట్టనివ్వాలి. ఇలా చేస్తే యాపిల్ ముక్కలు రంగు మారవు.
ఒక కప్పు నీటిలో కొద్దిగా తేనె వేయాలి. ఇందులో తరిగిన యాపిల్ ముక్కలను కూడా వేయాలి. కొద్ది సేపు వాటిని అలాగే వదిలేసి ఆ తరువాత బయటకు తీసి బాక్స్ సర్దుకోవాలి. ఇలా చేసినా యాపిల్ ముక్కలు రంగు మారకుండా తెల్లగా తాజాగా ఉంటాయి.
కట్ చేసిన యాపిల్ ముక్కల మీద నిమ్మరసం చల్లాలి. ఈ ముక్కలను ఒక బౌల్ లో వేసి బాగా కలపాలి. తరువాత వాటిని సాధారణంగానే బాక్స్ లో సర్దుకోవాలి. ఇలా చేసినా యాపిల్ ముక్కల రంగు మారదు.
యాపిల్ ముక్కలను కట్ చేసి విడిగా ఉంచకూడదు. యాపిల్ ను కట్ చేసి వాటన్నింటినీ తిరిగి ఒకే పండుగా ఉంచి దానికి టైట్ గా ఉండేందుకు రబ్బర్ వేయాలి. గాలి తగలకుండా ఉంటే యాపిల్ ముక్కలు రంగు మారవు. లేకపోతే యాపిల్ కట్ చేసిన వెంటనే ముక్కలను ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేయాలి. అలా చేసినా రంగు మారవు.
యాపిల్ తాజాగా, రంగు మారకుండా అస్వాదిస్తూ సహజంగా తినడానికి మార్గం దాన్ని నేరుగా నోటితో కొరుక్కుని తినడం. ఇలా చేస్తే ముక్కలు కట్ చేసిన తరువాత నల్లగా మారతాయనే బాధ ఉండదు. యాపిల్ మీద రకరకాల ప్రయోగాలు చేసే అవసరమూ ఉండదు. యాపిల్ సహజ రుచిని ఆస్వాదించవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి:
Guava: జామ పండుతో ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. నష్టాలు ఉన్నాయ్.. ఈ సమస్యలున్న వారు తినకూడదు..
Updated Date - Nov 06 , 2024 | 09:34 PM