Cotton buds: కాటన్ బడ్స్ వాడుతున్నారా? మీరు తెలీక చేస్తున్న తప్పు ఇదే!
ABN , Publish Date - Jun 02 , 2024 | 08:56 AM
తరచూ ఇయర్ బడ్స్ వాడితే చెవిలో అనేక రకాల సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: చెవి శుభ్రం చేసుకునేందుకు ఇయర్ వ్యాక్స్ (గులిగి) తొలగించుకునేందుకు మనందరం సాధారణంగా కాటన్ బడ్స్ వాడతాం. కొందరు తరచూ ఇయర్ బడ్స్ వాడుతుంటారు. అయితే, ఇది చాలా తప్పని వైద్యులు చెబుతున్నారు. ఈ అలవాటుతో అనేక ప్రమాదాలు ఉన్నాయని చెబుతున్నారు (Cotton Buds can lead to Hearing impairment).
అతిగా ఇయర్ బడ్స్ వాడితే చెవిలోని వ్యాక్స్ మరింత లోపలకు పోయి అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది. దీంతో, చెవిలో ఏదో చప్పుడు అవుతున్నట్టు, వినికిడి శక్తి తగ్గినట్టు అనిపిస్తుంది.
చెవి నాళిక చాలా మృదువుగా ఉంటుంది. తరచూ ఇయర్ బాడ్స్ వాడితే చెవి నాళికలోని పైపొరలు దెబ్బతింటాయి. దీంతో, నొప్పి, ఇన్ఫెక్షన్ల వంటివి తలెత్తుతాయి. బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫె్క్షన్లు తలెత్తొచ్చు
ఇయర్ బడ్స్ తో కర్ణభేరికి చిల్లు పడే ప్రమాదం కూడా ఉంది. చెవిలో శుభ్రం చేసుకునే క్రమంలో పొరపాటున ఇలా జరగొచ్చు. దీంతో, చెవిలో నొప్పి, వినికిడి శక్తి కోల్పోవడం, ఇతర ఇన్ఫెక్షన్లు తెలెత్తొచ్చు. దీన్ని సరి చేసేందుకు కొన్ని సందర్భాల్లో ఆపరేషన్ చేయాల్సి రావొచ్చు.
తరచూ ఇయర్ బడ్స్ వాడితే చెవిలోకి రకరకాల బ్యాక్టీరియాలు చేరే అవకాశం ఉంది. దీంతో, దురద, చెవి ఎర్రబడటం, డిశ్చార్జ్ వంటివి వస్తాయి.
సాధారణంగా చెవికి దాన్నంతట అదే శుభ్రం చేసుకునే వ్యవస్థ ఉంటుంది. ఇందులో భాగంగా చెవి గులిగి, మృతకణాలు వాతంట అవే బయటకు వచ్చేస్తాయి. అతిగా ఇయర్ బడ్స్ వాడకం ఈ ప్రక్రియకు అడ్డంకిగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Jaggery: అధిక కొలెస్టెరాల్ ఉన్న వాళ్లు బెల్లం తినొచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..
ఈ సమస్యలు వద్దనుకునే వారికి ఇయర్ బడ్స్ కు బదులు అనేక ప్రత్యామ్నాయాలను నిపుణులు సూచిస్తున్నారు.
సాధారణంగా బయటి చెవిని తడి బట్టతో శుభ్రం చేసుకుంటే సరిపోతుందని అంటున్నారు. ప్రత్యేకంగా ఇయర్ బడ్స్ అవసరం లేదని అంటున్నారు.
ఇక మెడికల్ షాపులల్లో దొరికే ఇయర్ డ్రాప్స్ చెవిని సులువుగా శుభ్రం చేస్తాయి. గులిగి కరిగిపోయి బయటకు వచ్చేలా చేస్తాయి.
చెవిలో ఇబ్బంది ఎక్కువగా ఉన్నప్పుడు వైద్యులు ప్రత్యేక పద్ధతుల్లో చెవిని శుభ్రం చేస్తారు. ప్రత్యేక పరికరాలతో చెవిలోని మలినాలను తొలగిస్తారు.
ఇయర్ ఇరిగినేషన్‌తో కూడా చెవిని సులువగా శుభ్రం చేస్తారు. శుశిక్షితులైన వైద్యులు ఇది నిర్వహిస్తారు. ఇందులో భాగంగా స్వల్ప ఒత్తిడితో నీటిని చెవిలోకి పంపిస్తారు. దీంతో, మలినాలన్నీ బయటకు వచ్చేస్తాయి. ఈ ప్రక్రియతో చెవికి ఎలాంటి ఇబ్బందీ వాటిల్లదు.