Share News

Viral: టిక్‌టాక్ స్టార్ ప్రాణాలు తీసిన సెల్ఫీ.. జలపాతం వద్ద ఫోటోలు తీస్తుండగా..

ABN , Publish Date - Jul 31 , 2024 | 06:45 PM

రీల్స్ (Reels) లేదా సెల్ఫీల కోసం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఒక్కోసారి భయంకరమైన విన్యాసాలు చేస్తుంటారు. ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా..

Viral: టిక్‌టాక్ స్టార్ ప్రాణాలు తీసిన సెల్ఫీ.. జలపాతం వద్ద ఫోటోలు తీస్తుండగా..
Tiktoker Falls To Death

రీల్స్ (Reels) లేదా సెల్ఫీల (Selfies) కోసం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఒక్కోసారి భయంకరమైన విన్యాసాలు చేస్తుంటారు. ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా.. సరైన క్లిక్ పడితే లైక్స్, వ్యూస్ వస్తాయన్న ఉద్దేశంతో ముందడుగు వేస్తుంటారు. అయితే.. ఇలాంటి స్టంట్స్ చేసి ఇప్పటికే కొందరు తమ ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఓ టిక్‌టాక్ స్టార్ కూడా మృతి చెందింది. ఒక జలపాతం వద్ద నిల్చొని ఫోటోలు తీస్తున్న సమయంలో.. అనుకోకుండా కాలు జారి పడిపోయింది. దీంతో ఆమె మరణించింది. ఈ ఘటన మయన్మార్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..


సెల్ఫీలు తీస్తుండగా..

ఆ యువతి పేరు మో స నే. ఆమె వయసు 14 సంవత్సరాలు. ఆమె ఒక టిక్‌టాక్ స్టార్. సోషల్ మీడియాలో 1,50,000 మందికి పైగా ఫాలోవర్లను కలిగి ఉంది. కట్ చేస్తే.. జులై 22వ తేదీన ఆమె తన స్నేహితులతో కలిసి సౌత్ ఈస్ట్ యమన్మార్‌లోని పాంగ్ పట్టణంలో ఉన్న సినివా జలపాతానికి వెళ్లింది. అక్కడి ప్రకృతి అందాల మధ్య సెల్ఫీలు తీసుకొని.. తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేయాలని అనుకుంది. అయితే.. ఆ ప్రాంతంలోని రాళ్లన్ని తేమగా ఉన్నాయి. దీంతో.. సెల్ఫీ తీస్తున్న టైంలో ఆమె కాలుజారి కిందపడింది. రెండు బలమైన బండరాళ్ల మధ్య చిక్కుకుంది. తనని తాను కాపాడుకోవడానికి గట్టిగానే ప్రయత్నించింది కానీ, చుట్టూ బలమైన నీటి ప్రవాహం కారణంగా తప్పించుకోలేకపోయింది. చివరికి ఆమె ప్రాణాలు కోల్పోయింది.


రంగంలోకి రెస్క్యూ బృందం..

ఈ సమాచారం అందుకున్న రెస్క్యూ బృందం వెంటనే రంగంలోకి దిగింది. అయితే.. ఆ బాలిక మృతదేహాన్ని బయటకు తీయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. మరుసటి రోజు వలంటీర్లు, ఫైర్ ఫైటర్స్ వచ్చి.. ఎట్టకేలకు ఆమె మృతదేహాన్ని రాళ్ల మధ్యలో నుంచి బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోని సైతం చిత్రీకరించారు. ఓ రెస్క్యూ వర్క్ ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. ఆ యువతి రెండు రాళ్ల మధ్య ఇరుక్కుందని, బయటకు రాలేక చనిపోయిందని తెలిపారు. స్నేహితులు ఆమెను రక్షించడానికి ప్రయత్నించారు కానీ, బయటకు తీయలేకపోయారని అన్నారు. చివరికి సహాయక బృందం, అధికారులు వచ్చి.. ఆ బాలిక మృతదేహాన్ని బయటకు తీయడం జరిగిందని వివరించారు.


మరొకరు కూడా జారిపడి..

బాలిక మృతదేహాన్ని బయటకు తీసిన తర్వాత అధికారులు స్వాధీనం చేసుకొని.. పోస్టుమార్టం నిమిత్తం పాంగ్ టౌన్‌షిప్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు.. ఆ యువతితో పాటు ఆమె స్నేహితుడు నాయ్ కూడా జారిపడ్డాడు. అదృష్టవశాత్తూ.. ఈ సంఘటనలో అతనికి స్వల్ప గాయాలే అయ్యాయి. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. కానీ.. మో కుటుంబంలో మాత్రం విషాదఛాయలు అలుముకున్నాయి.

Read Latest International News and Telugu News

Updated Date - Jul 31 , 2024 | 06:45 PM