ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

China: వాళ్లకు చైనా గుడ్‌న్యూస్.. వీసా లేకపోయినా..

ABN, Publish Date - Dec 19 , 2024 | 08:29 PM

పర్యాటకులను ఆకర్షించేందుకు చైనా బంపర్ ఆఫర్ ప్రకటించింది. విదేశీ ప్రయాణీకులను తమ దేశానికి రప్పించేందుకు వీసా నిబంధనలు సవరించింది. చైనా తీసుకున్న తాజా నిర్ణయం మొత్తం 54 దేశాలకు వర్తిస్తుంది. ఈ విషయం పర్యాటక ప్రియులకు వీనులవిందే. మరి, ఈ దేశాల జాబితాలో భారత్ ఉందా?..

China

పర్యాటకులను ఆకర్షించేందుకు చైనా బంపర్ ఆఫర్ ప్రకటించింది. విదేశీ ప్రయాణీకులను తమ దేశానికి రప్పించేందుకు వీసా నిబంధనలు సవరించింది. చైనా తీసుకున్న తాజా నిర్ణయం మొత్తం 54 దేశాలకు వర్తిస్తుంది. ఈ విషయం పర్యాటక ప్రియులకు వీనులవిందే. వీసా రహిత విధానంలో చైనాను సందర్శించే అవకాశం గతంలో మూడు దేశాలకు మాత్రమే ఉండేది. 2019లో కొవిడ్ రావడంతో వీసా రహిత పర్యాటకులకు ద్వారాలు మూసేసింది డ్రాగన్ దేశం. 2023 తర్వాత సరిహద్దులను పునరుద్ధరించింది. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటంలో భాగంగా అంతర్జాతీయ పర్యాటకులను ప్రోత్సహిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.


ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రావెలింగ్ లవర్స్‌కు తీపి కబురు అందించింది చైనా. వీసా రహిత విధానంలో సడలింపులు తీసుకొచ్చినట్లు చైనీస్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. కొవిడ్ నేపథ్యంలో దాదాపు మూడు సంవత్సరాల స్వీయ నిర్భంధంలో ఉన్న చైనా.. 2023లో సరిహద్దు తలుపులను మళ్లీ తెరిచింది. ఇంతకు ముందు 72 నుంచి 144 గంటల వరకే వీసా రహిత పర్యటనలకు అనుమతి ఉండేది. ప్రస్తుతం ఆ నిబంధనను సవరిస్తూ 240 గంటలు లేదా 10 రోజులకు గడువు పెంచింది. గతంలో కంటే ఇది దాదాపు మూడు రెట్లు ఎక్కువ. ఈ నూతన విధానం 54 దేశాలకు అందుబాటులోకి రానుంది.


కొత్త ప్రకటన ప్రకారం, యునైటెడ్ స్టేట్స్, రష్యా, బ్రెజిల్, యునైటెడ్ కింగ్‌డమ్‌, కెనడా సహా 54 దేశాల నుంచి అర్హత కలిగిన పౌరులు వీసా లేకుండానే చైనాలోకి ప్రవేశించగలరు. సందర్శకులు 24 ప్రావిన్సెస్‌లో ఉన్న 60 పోర్ట్‌లలో దేని ద్వారానైనా ప్రవేశించవచ్చని పేర్కొంది చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ. గతంలో 19 ప్రావిన్సుల్లోని ఓడరేవుల్లోనే పర్యాటకులను అనుమతించేవారు. తాజా నిబంధనల ఫలితంగా, ఈ ఏడాది జూలై -సెప్టెంబర్ మధ్య మూడు నెలల సమయంలోనే 8.2 మిలియన్ల విదేశీ పౌరుల ఎంట్రీలను నమోదు చేసింది చైనా. అందులో 4.9 మిలియన్లు వీసా రహితమైనవి అని విదేశాంగ మంత్రిత్వ శాఖ కాన్సులర్ అధికారి వెల్లడించినట్లు అధికారిక జిన్హువా న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.


54 దేశాల జాబితాలో భారత్ ఉందా?

ట్రాన్సిట్ వీసా-రహిత విధానంలో చైనా ప్రకటించిన 54 దేశాల జాబితాలో ఏమేం ఉన్నాయంటే.. అల్బేనియా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బెలారస్, బెల్జియం, బోస్నియా, హెర్జెగోవినా, బ్రెజిల్, బ్రూనై, బల్గేరియా, కెనడా, చిలీ, క్రొయేషియా, సైప్రస్, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఎస్టోనియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, హంగేరి, ఐస్‌లాండ్, ఐర్లాండ్, ఇటలీ, జపాన్, లాత్వియా, లిథువేనియా, లక్సెంబర్గ్, మాల్టా, మెక్సికో, మొనాకో, మాంటెనీగ్రో, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, ఉత్తర మాసిడోనియా, నార్వే, పోలండ్, పోర్చుగల్, ఖతార్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, రొమేనియా, రష్యా, సెర్బియా, సింగపూర్, స్లొవేకియా, స్లొవేనియా, స్పెయిన్, స్వీడన్ స్విట్జర్లాండ్, ఉక్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్.

Updated Date - Dec 19 , 2024 | 08:29 PM