SIM Cards Block: 5 లక్షల సిమ్ కార్డులు బ్లాక్.. ఎందుకంటే..
ABN, Publish Date - May 01 , 2024 | 04:08 PM
SIM Cards Block in Pakistan: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 5 లక్షల సిమ్ కార్డ్స్ బ్లాక్(SIM Cards Block) చేశారు. ఎందుకు బ్లాక్ చేశారంటే.. ఆదాయం(Income) పెంచుకోవడానికట! అవును, ఈ షాకింగ్ నిర్ణయం దేశ ప్రభుత్వం తీసుకుంది. మరి ఏ దేశ ప్రభుత్వం.. ఎందుకు సిమ్ కార్డ్స్ బ్లాక్ చేసిందో తెలియాలంటే పూర్తి కథనం తెలుసుకోవాల్సిందే. పీకల్లోతు ఆర్థిక కష్టాలతో ఉన్న..
SIM Cards Block in Pakistan: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 5 లక్షల సిమ్ కార్డ్స్ బ్లాక్(SIM Cards Block) చేశారు. ఎందుకు బ్లాక్ చేశారంటే.. ఆదాయం(Income) పెంచుకోవడానికట! అవును, ఈ షాకింగ్ నిర్ణయం దేశ ప్రభుత్వం తీసుకుంది. మరి ఏ దేశ ప్రభుత్వం.. ఎందుకు సిమ్ కార్డ్స్ బ్లాక్ చేసిందో తెలియాలంటే పూర్తి కథనం తెలుసుకోవాల్సిందే. పీకల్లోతు ఆర్థిక కష్టాలతో ఉన్న పాకిస్తాన్(Pakistan).. ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇన్‌కమ్ ట్యాక్స్ (Income Tax) కట్టని 5 లక్షల మంది సిమ్ కార్డ్స్‌ని బ్లాక్ చేయాలని డిసైడ్ అయ్యింది. అంతేకాదు.. ఈ మేరకు టెలికాం సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. దేశంలో చాలా మంది పన్ను ఎగవేస్తున్నారని గుర్తించిన పాక్ ప్రభుత్వం.. గత ఏడాది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయని వారిపై కొరడా ఝుళిపించింది. వారి మొబైల్ సిమ్ కార్డ్స్‌ని బ్లాక్ చేయాలని టెలికాం సంస్థలను ఆదేశించింది.
ఆర్థిక కష్టాలతో ఆగమాగం అవుతున్న పాక్ సర్కార్.. పన్ను చెల్లింపులపై దృష్టి సారించింది. దేశ వ్యాప్తంగా 24 లక్షల మంది పన్ను చెల్లించడం లేదని గుర్తించిన పాక్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ.. వారందరికీ నోటీసులు జారీ చేసింది. గడిచిన మూడేళ్లలో కనీసం ఒక సంవత్సరానికి సంబంధించిన తమ ఆదాయాన్ని ప్రకటించాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే, ఈ నోటీసులను కొందరు బేఖాతరు చేశారు. దాదాపు 5 లక్షలకు పైగా మంది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేదట. దాంతో.. ఇక లాభం లేదనుకున్న పాక్ సర్కార్.. కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఐటీ రిటర్న్స్ చేయని 5,06,671 మంది సిమ్ కార్డులను తక్షణమే బ్లాక్ చేయాలని ప్రభుత్వ టెలికాం అథారిటీ సహా అన్ని టెలికాం కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన తరువాత ఆటోమేటిక్‌గా బ్లాక్ చేసిన సిమ్ కార్డ్స్‌ని పునరుద్ధరించడం జరుగుతుందని పాక్ ప్రభుత్వం చెబుతోంది.
ఇవికూడా చదవండి:
మొత్తం ముంబై జట్టుకి పెద్ద షాక్..
నివాసం వద్ద కాల్పులు: నిందితుడు ఆత్మహత్య
For More International News and Telugu News..
Updated Date - May 01 , 2024 | 04:08 PM