ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sunitha Williams: సునీతా విలియమ్స్ తిరిగొచ్చేనా.. మళ్లీ తేదీ మార్చిన నాసా

ABN, Publish Date - Dec 19 , 2024 | 04:47 PM

భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగొచ్చే తేదీ మళ్లీ వాయిదా పడింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న సునీత, ఆమె సహచర వ్యోమగామి బుచ్ విల్‌మోర్‌ను మార్చి 2025 లోపు తీసుకురావడం సాధ్యం కాదని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మంగళవారం ప్రకటించింది. వచ్చే మార్చిలోపు రాకపోతే ఏమవుతుందంటే..

Sunitha Williams

భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగి రావడం మళ్లీ వాయిదా పడింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న సునీత, ఆమె సహచర వ్యోమగామి బుచ్ విల్‌మోర్‌ను మార్చి 2025 లోపు తీసుకురావడం సాధ్యం కాదని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మంగళవారం ప్రకటించింది. వారం రోజుల ప్రయోగాత్మక యాత్రలో భాగంగా ఈ ఏడాది మే నెలలో సునీత, బుచ్ రోదసిలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. కానీ, బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారి మిషన్ 8 నెలలు దాటినా పూర్తికాలేదు.


ఇప్పటికే ఐఎస్‌ఎస్‌లో ఉండే మైక్రోగ్రావిటీ కారణంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు సునీత, బుచ్‌లు. కండరాలు, ఎముకలు దెబ్బతినకుండా ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచుకునేందుకు ఉండేందుకు వ్యోమగాములు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. దీంతో ఆ మధ్య ‘‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో చిక్కిపోయిన సునీతా విలియమ్స్‌’’అంటూ ప్రపంచవ్యాప్తంగా వార్తలు, వీడియోలు వైరల్‌ అయ్యాయి. తర్వాత సైక్లింగ్‌, ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్‌, బరువులు ఎత్తడం (వెయిట్‌ లిఫ్టింగ్‌) వంటివి చేయడం వల్ల చిక్కిపోయినట్లు కనిపిస్తున్నాని.. బరువు తగ్గలేదని సునీతా విలియమ్స్ వివరణ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.


అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సునీత, బుచ్‌లను భూమికి తిరిగి తీసుకురావడానికి ఒక వ్యోమనౌక అంతరిక్ష కేంద్రానికి వెళ్తుందని నాసా ఇంతకుముందు తెలిపింది. ఇద్దరు వ్యోమగాముల తిరుగు ప్రయాణ బాధ్యతను తిరిగి తీసుకువచ్చే బాధ్యతను ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్‌ఎక్స్‌కు అప్పగించింది. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా స్పేస్‌ఎక్స్‌ క్యాప్సుల్‌ను పంపి వ్యోమగాములను భూమికి తీసుకొస్తారని అంతా భావించారు. ఇప్పటికే పలుమార్లు తేదీ తర్వాత తేదీ ఇస్తూ ఆలస్యం చేస్తూ వచ్చిన నాసా.. మళ్లీ మరోసారి వాయిదా వేసింది. తాజా అప్‌డేట్‌లో మార్చి 2025 చివరిలోపు అంతరిక్ష నౌకను ప్రయోగించబోమని వెల్లడించింది.


వ్యోమగాములు సునీత విలియమ్స్,బుచ్ విల్‌మోర్‌లను తిరిగి తీసుకువచ్చే బాధ్యతను ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్‌ఎక్స్‌కు అప్పగించింది నాసా. ఇద్దరు వ్యోమగాములు క్రూ-10 డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా తిరిగి వస్తారని ప్రకటించింది. అయితే, మార్చి 2025కి ముందు క్రూ-10ని ప్రయోగించబోమని మంగళవారం ఒక బ్లాగ్ పోస్ట్‌ ద్వారా స్పష్టం చేసింది. కొత్త వ్యోమనౌక ప్రక్రియను పూర్తిచేసేందుకు స్పేస్‌ఎక్స్‌ బృందానికి మరికొంత సమయం ఇచ్చినట్లు వెల్లడించింది. నాసా తాజా ప్రకటన ప్రకారం సునీతా విలియమ్స్ రాక కోసం ఏప్రిల్ తొలివారం వరకూ వేచిచూడాల్సిందే.

Updated Date - Dec 19 , 2024 | 07:24 PM