ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Spurious Liquor: కల్తీ మద్యం తాగి 29 మంది మృతి, మరో 60 మందికి అనారోగ్యం..సీఎం స్పందన

ABN, Publish Date - Jun 20 , 2024 | 07:10 AM

తమిళనాడు(Tamil Nadu) కళ్లకురిచ్చి జిల్లా(Kallakurichi)లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం(illicit liquor) తాగి 29 మంది చనిపోగా, మరో 60 మందికి పైగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Kallakurichi Tamil Nadu spurious liquor

తమిళనాడు(Tamil Nadu) కళ్లకురిచ్చి జిల్లా(Kallakurichi)లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం(illicit liquor) తాగి 29 మంది చనిపోగా, మరో 60 మందికి పైగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని కళ్లకురిచ్చి జిల్లా కలెక్టర్ ఎంఎస్ ప్రశాంత్ ధృవీకరించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో కళ్లకురిచ్చి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని జిల్లా కలెక్టర్ పరామర్శించారు.


కళ్లకురిచ్చిలో కల్తీ మద్యం సేవించి పలువురు మరణించారనే వార్త దిగ్భ్రాంతికి గురిచేసిందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌(cm stalin) సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ ఘటనపై సీబీసీఐడీ విచారణకు ఆదేశించారు. దీంతోపాటు ఈ కేసులో నేరానికి పాల్పడిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారని, ఈ వ్యవహారంలో విఫలమైన అధికారులపై కూడా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వ్యక్తుల గురించి తెలియజేస్తే వెంటనే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి కూడా మృతులకు సంతాపం వ్యక్తం చేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.


అప్రమత్తమైన అధికారులు మద్యం ప్యాకెట్లను(spurious liquor) విక్రయించిన వ్యాపారి 49 ఏళ్ల కె. కన్నుకుట్టిని అరెస్టు చేసి అతని నుంచి స్వాధీనం దాదాపు 200 లీటర్ల కల్తీ మద్యంను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో మద్యం విక్రయించిన వాటిలో ప్రాణాంతక 'మీథేన్' ఉన్నట్లు తేలింది. ఈ ఘటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శ్రావణ్‌కుమార్ జత్వాత్ బదిలీ అయ్యారు. కళ్లకురిచ్చి జిల్లా కొత్త కలెక్టర్‌గా ఎంఎస్‌ ప్రశాంత్‌ నియమితులయ్యారు. దీంతోపాటు కళ్లకురిచ్చి ఎస్పీ సమయసింగ్ మీనాపై సస్పెన్షన్ వేటు పడింది. కొత్త పోలీసు సూపరింటెండెంట్‌గా రజత్ చతుర్వేది నియమితులయ్యారు. పలువురు పోలీసు అధికారులను కూడా సస్పెండ్ చేశారు.


ఇది కూడా చదవండి:

NDA Government: వరి, జొన్న, పత్తి సహా 14 పంటలకు మద్దతు ధర పెంపు


ఒమేగా హాస్పిటల్స్‌లోకి రూ.500 కోట్ల పెట్టుబడులు


For Latest News and National News click here

Updated Date - Jun 20 , 2024 | 10:18 AM

Advertising
Advertising