ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సైబర్‌ వల.. బతుకులు విలవిల!

ABN, Publish Date - Oct 26 , 2024 | 03:59 AM

‘‘రూ.లక్షల్లో కాదు.. కోట్లలో వేతనాలు. కూర్చున్న చోట నుంచి కదలాల్సిన పని కూడా లేదు. అలుపెరుగకుండా ఆయాసం లేకుండా పని చేసుకునే వెసులుబాటు. రండి! చేరండి!’’ ఇవీ.. సోషల్‌ మీడియాలో తరచుగా కనిపించే ప్రకటనలు.

  • ఆగ్నేయాసియాలో 29 వేల మంది భారతీయ యువతీ యువకుల మిస్సింగ్‌

  • ఉద్యోగాలపై సోషల్‌ మీడియాలో ప్రకటన

  • వెళ్లిన వారితో బలవంతపు సైబర్‌ నేరాలు

న్యూఢిల్లీ, అక్టోబరు 25: ‘‘రూ.లక్షల్లో కాదు.. కోట్లలో వేతనాలు. కూర్చున్న చోట నుంచి కదలాల్సిన పని కూడా లేదు. అలుపెరుగకుండా ఆయాసం లేకుండా పని చేసుకునే వెసులుబాటు. రండి! చేరండి!’’ ఇవీ.. సోషల్‌ మీడియాలో తరచుగా కనిపించే ప్రకటనలు. వీటిని నమ్మి.. రూ.కోట్లకు ఆశపడి ఈ ప్రకటనల వలలో చిక్కితే ఇక అంతే!. సైబర్‌ నేర సామ్రాజ్యంలో బానిసలుగా బతకాల్సిందే. ఇలా.. ఆగ్నేయాసియాలోని సైబర్‌ ముఠాల వలలో చిక్కుకుని ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 29 వేల మంది భారతీయులు కనిపించకుండా పోయారు. 2022, జనవరి నుంచి 2024 మధ్య వీరంతా మిస్సయినట్టు తాజాగా ఓ నివేదిక పేర్కొంది. ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామంటూ సైబర్‌ మాయగాళ్లు వీరిని మోసం చేసినట్టు నివేదిక వెల్లడించింది.

‘వెబ్‌ ఆఫ్‌ డిసీట్‌; ట్రాన్సనేషనల్‌ సైబర్‌ స్లేవరీ, ఆగ్నేయాసియాలో వ్యవస్థీకృత నేరాలు’ పేరిట విడుదలైన ఈ నివేదిక పలు విషయాలను వివరించింది. వ్యవస్థీకృత నేరగాళ్ల ముఠా ఒక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుని.. యువతీ యువకులను ఉద్యోగా ల పేరిట ఆకర్షించింది. నమ్మి వెళ్లినవారితో బలవంతంగా సైబర్‌ నేరాలను చేయించడం ఈ ముఠా ప్రధాన లక్ష్యం. ఈ ముఠా ప్రధానంగా కాంబోడియా, లావో్‌సలను కేంద్రంగా చేసుకుని పనిచేస్తున్నట్టు నివేదిక పేర్కొంది. భారత్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌లకు చెంది న యువతను అత్యధిక వేతనాలతో కూడిన ఉద్యోగాలు ఇస్తామంటూ ఆకర్షించింది.


  • ఇలా వల!

సైబర్‌ నేరగాళ్ల ముఠాలు.. సామాజిక మాధ్యమాలను, జాబ్‌ పోర్టళ్లను వేదికలుగా చేసుకుని తమ పన్నాగాలను అమలు చేస్తున్నాయి. ఫేస్‌బుక్‌, టెలిగ్రామ్‌, వాట్సా్‌పలలో ఉద్యోగాలకు సంబంధించి నకిలీ ప్రకటనలు గుప్పిస్తాయి. భారీ వేతనాలంటూ ఆకర్షణీయమైన ప్రకటనలతో యువతను ఆకట్టుకున్నాయి. వినియోగదారుల సేవలు, క్రిప్టో కరెన్సీ వాణిజ్యం వంటి ఉద్యోగాలే మీరు చేయాల్సిందని నమ్మబలుకుతాయి. అంతేకాదు.. ఈ ముఠా 20 నుంచి 39 ఏళ్ల వయసున్న వారినే లక్ష్యంగా చేసుకుని ప్రకటనలు గుప్పిస్తాయి. ఇలా ఈ ప్రకటనలకు ఆకర్షితులై.. భారత్‌ నుంచి వేలాది మంది యువతీ యువకులు ఈ ముఠాల బారినపడ్డారు. ఇక, ఇలా వెళ్లిన వారి నుంచి ముందుగా పాస్‌పోర్టు, గుర్తింపు కార్డులు, కీలకమైన పత్రాలను ముఠా సభ్యులు స్వాధీనం చేసుకుంటారు.

అనంతరం.. వారిని రహస్య ప్రాంతాల్లో నిర్బంధిస్తారు. వారితో బలవంతంగా సైబర్‌ నేరాలు చేయిస్తారు. ఫిషింగ్‌ కుంభకోణాలు, క్రిప్టో కరెన్సీ మోసా లు, నకిలీ రుణ యాప్‌ల ద్వారా ప్రజలను మోసం చేయిస్తారు. ఈ ముఠాల వెనుక.. నేరాలకు పాల్పడే అనేక సంస్థలు ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది. వీటిలో అత్యంత కరడుగట్టిన నేర ముఠాలుగా పేరు న్న జిన్‌ బీ గ్రూప్‌, ది కింగ్స్‌ రోమన్స్‌ గ్రూప్‌, ది ప్రిన్స్‌ గ్రూప్‌ ఉన్నట్టు తెలిపింది. ఇవన్నీ ఆగ్నేయాసియా నుంచే తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు నివేదిక వెల్లడించింది. బాధితుల్లో ఎక్కువ మంది ఈ గ్రూపుల్లోనే బలవంతపు బానిసలుగా ఉన్నారని తెలిపింది. ఎక్కువ మంది భారతీయులు విజిటర్స్‌ వీసాపై థాయ్‌లాండ్‌, కాంబోడియా, లావోస్‌, వియత్నాంలకు వెళ్లారని.. ఇప్పటి వరకు తిరిగి రాలేదని పేర్కొంది.


  • ప్రత్యక్ష నరకం!

సైబర్‌ ముఠాల బారిన చిక్కుకున్న వారు బానిసలుగా బతకాల్సిందేనని నివేదిక తెలిపింది. ఏమాత్రం వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానం కలిగినా.. భౌతిక దాడులతో పాటు ప్రత్య క్ష నరకం ఎలా ఉంటుందో రుచిచూపిస్తారు. రక్తాలు కారేలా కొట్టడంతోపాటు, కాళ్లు, చేతులు కూడా విరగ్గొట్టేస్తారు. రోజుల తరబడి తిండి, నీరు లేకుండా చేసి దారిలోకి తెచ్చుకుంటారు. వీరిపై ముఠా సభ్యుల నిరంతర పర్యవేక్షణ కూడా ఉంటుంది. అంతేకాదు.. రోజువారీ కుంభకోణాలు, మోసాలకు సంబంధించి లక్ష్యాలు విధిస్తారు. వాటిని సాధించకపోతే తీవ్రంగా హింసిస్తారు. ఆర్థిక మోసాలను ఎన్ని రూపాల్లో చే యొచ్చో అన్నీ చేయిస్తారు. యువతులతో అర్థనగ్నం గా ఫోన్లు చేయించి వలపు వల విసిరేలా చేస్తారు.

  • 4 నెలల్లో రూ.1750 కోట్ల మోసం

ఈ ఏడాది తొలి నాలుగు మాసాల్లో సైబర్‌ నేరాల బారిన పడిన భారతీయులు రూ.1,750 కోట్లకు పైగా మోస పోయారని నివేదిక వెల్లడించింది. ఇదంతా ఆగ్నేయాసియా సైబర్‌ ముఠా పనేనని పేర్కొంది. అదేవిధంగా అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియాలలోనూ బాధితులు భారీ సంఖ్యలోనే ఉన్నారని తెలిపింది.


  • భారత ప్రభుత్వం స్పందించాలి

సైబర్‌ నేరగాళ్ల ముఠాలను అరికట్టేందుకు భారత్‌ సహా అంతర్జాతీయ సమాజం స్పందించాలని ‘వెబ్‌ ఆఫ్‌ డిసీట్‌; ట్రాన్సనేషనల్‌ సైబర్‌ స్లేవరీ, ఆగ్నేయాసియాలో వ్యవస్థీకృత నేరాలు’ నివేదిక కోరింది. సమగ్రమైన చర్యలకు దిగాలని సూచించింది. దీనిలో భాగంగా వీసా నిబంధనలను మరింత కఠినతరం చేయాలని, సరిహద్దుల వద్ద నియంత్రణలను పెంచాలని ప్రభుత్వాలను కోరింది. నకిలీ ఉద్యోగ ప్రకటనలను తొలగించేలా టెక్‌ కంపెనీలను అప్రమత్తం చేయాలని సూచించింది. భారత్‌ వంటి దేశాలు ఇలాంటి నకిలీ ప్రకటనలు, సైబర్‌ నేరగాళ్ల ముఠాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించింది.

Updated Date - Oct 26 , 2024 | 04:00 AM