Madhya Pradesh: ముగ్గురు చిన్నారులు మృతి.. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
ABN , Publish Date - Jul 02 , 2024 | 06:44 PM
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శ్రీ యుగపురుష్ దామ్ బౌదిక వికాస్ కేంద్రం పాఠశాలలో ముగ్గురు చిన్నారులు మరణించారు. మరో 12 మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వారిని స్థానిక చాచా నెహ్రూ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.
ఇండోర్, జులై 02: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శ్రీ యుగపురుష్ దామ్ బౌదిక వికాస్ కేంద్రం పాఠశాలలో ముగ్గురు చిన్నారులు మరణించారు. మరో 12 మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వారిని స్థానిక చాచా నెహ్రూ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ అశీష్ సింగ్ విచారణకు ఆదేశించారు. ఆ క్రమంలో అసిస్టెంట్ డిస్ట్రిక్ మెజిస్ట్రేట్ అధ్యక్షతన విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Also Read: Uttar Pradesh: తొక్కిసలాటలో 100 మందికి పైగా మృతి
అలాగే చిన్నారులు తిన్న ఆహార పదార్ధాలను సైతం పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపామన్నారు. ఇక చిన్నారుల శవ పరీక్షకు సంబంధించిన నివేదిక అందాల్సి ఉందని వివరించారు. మరోవైపు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
Also Read: AndhraPradesh: 11 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ
ఈ ఆసుపత్రిలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందడమే కాకుండా.. పలువురు విద్యార్థులు వాంతులతో బాధపడుతున్నారని తమకు ఈ రోజు ఉదయం సమాచారం అందిందని జిల్లా కలెక్టర్ రాజేంద్ర రఘువంశీ వెల్లడించారు. దీంతో వారందరినీ స్థానిక చాచా నెహ్రూ ఆసుపత్రికి తరలించామన్నారు. ఇక మృతి చెందిన ముగ్గురు చిన్నారుల్లో.. జూన్ 30వ తేదీన ఒకరు మరణిస్తే.. జులై 1వ తేదీన మరో ఇద్దరు మృతి చెందారని తెలిపారు.
Also Read: AP Politics: సీఎం రేవంత్‌తో వైఎస్ షర్మిల భేటీ.. స్కెచ్‌లో భాగమేనా?
ఈ ఘటనపై చాచా నెహ్రూ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రీతి మల్పాని మాట్లాడుతూ.. ఈ రోజు ఉదయం 12 మంది చిన్నారులను ఆసుపత్రికి తీసుకువచ్చారన్నారు. వారంతా వాంతులు, అతిసారంతో గత రాత్రి నుంచి బాధపడుతున్నారని తెలిపారు. వీరంతా చెవిటి, మూగ, ఆంధులతోపాటు దివ్యాంగులు సైతం ఉన్నారని వివరించారు. ఇండోర్‌లో ఓ ఎన్జీవో సంస్థ.. ఈ పాఠశాలను నడుపుతుంది. ప్రస్తుతం ఆ పాఠశాలలో మొత్తం 201 మంది విద్యార్థులున్నారు.
Also Read: West Bengal: చోప్రా వీడియో ఘటనలో కీలక మలుపు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News