Modi Cabinet: ఆ రాష్ట్రంలో గెలిచింది ఐదుగురు.. ముగ్గురికి కేంద్రమంత్రి పదవులు.. అసలు కారణం ఏమిటంటే..
ABN, Publish Date - Jun 10 , 2024 | 08:20 AM
ఒక్కోసారి అనుకోకుండా అదృష్టం కలిసివస్తుందంటే ఏమో అనుకుంటాం. సరిగ్గా హర్యానా విషయంలో ఇదే జరిగింది. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడింది.
ఒక్కోసారి అనుకోకుండా అదృష్టం కలిసివస్తుందంటే ఏమో అనుకుంటాం. సరిగ్గా హర్యానా విషయంలో ఇదే జరిగింది. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడింది. మోదీతో పాటు కేంద్రమంత్రులుగా మరో 71 మంది ప్రమాణస్వీకారం చేశారు. ఆయా రాష్ట్రాల్లో ఎంపీల సంఖ్య, పార్టీ గెలిచిన ఎంపీల ఆధారంగా కేంద్రమంత్రి (Central Minister) పదవులు కేటాయించారు. కానీ హర్యానా విషయంలో మాత్రం బీజేపీ భిన్నంగా ఆలోచించింది. 90 శాసనసభ నియోజకవర్గాలు ఉన్న ఆ రాష్ట్రంలో 10 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా.. ఈ ఎన్నికల్లో బీజేపీ ఐదు ఎంపీలు మాత్రమే గెలుచుకుంది. కానీ ఐదుగురిలో ముగ్గురికి కేంద్రమంత్రి వర్గంలో అవకాశం కల్పించింది. ఈ విషయం కొంత ఆశ్చర్యకరంగా ఉన్నా మోదీ మాత్రం హర్యానాకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. దీనంతటికి కారణం హర్యానాలో ఈ ఏడాది చివర్లో శాసనసభ ఎన్నికలు ఉండటమే. అక్కడి ప్రభుత్వ గడువు ఈ ఏడాది నవంబర్‌తో ముగుగస్తుంది. అంటే అక్టోబర్ నెలఖారులోపు హర్యానాలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. దీంతో హర్యానాపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. హర్యానాతో పాటు మహారాష్ట్రలో కూడా అదే సమయంలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.
Cabinet Meeting: ఇవాళ సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ మీటింగ్
అసలు కారణం అదేనా..
హర్యానా దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉంటుంది. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన నాలుగు నెలల్లో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉంది. మరోసారి ఇక్కడ గెలవాలని బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఒకవేళ హర్యానాలో ఓడిపోతే ఆ ఎఫెక్ట్ కేంద్రప్రభుత్వంపై కొంతమేరకు పడే అవకాశం ఉంటుంది. దీంతో హర్యానాలో గెలుపును కమలనాధులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలోనే హర్యానా నుంచి ఐదుగురు ఎంపీలు గెలిచినా మూడు కేంద్రమంత్రి పదవులు ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌ను కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకున్నారు.ఎన్నికల కారణంగానే హర్యానాకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.
మైనార్టీ ప్రభుత్వం..
హర్యానాలో ఇప్పటికీ ప్రభుత్వం మైనార్టీలో ఉంది. ఆ రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా మెజార్టీ మార్క్ 46. బీజేపీకి 41 సీట్లు ఉండగా.. ఎన్డీయే భాగస్వామ్య పార్టీ హెచ్‌ఎల్‌పికి ఒక సీటు, మరో ఇండిపెండెంట్ ఎన్డీయేలో చేరడంలో బీజేపీ బలం 43కు చేరింది. ప్రస్తుతం మూడు ఎమ్మెల్యే స్థానాలు వేకెంట్‌లో ఉండటంతో అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు 44 మంది ఎమ్మెల్యేల బలం అవసరం బీజేపీకి 43 మంది మాత్రమే ఉన్నారు. అయినప్పటికీ మరో నాలుగు నెలలు మాత్రమే ఎన్నికలకు సమయం ఉండటంతో ఇక్కడ ప్రభుత్వం పడిపోయే అవకాశం లేదు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఎన్డీయే, ఇండియా కూటములు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. కేంద్రమంత్రి వర్గంలో హర్యానాకు ప్రాధాన్యత ఇవ్వడం బీజేపీకి కలిసొస్తుందా లేదా అనేది హర్యానా ఎన్నికల ఫలితాల తర్వాత తేలనుంది.
VK Pandyan: రాజకీయాలకు పాండ్యన్ బైబై
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More National News and Latest Telugu News
Updated Date - Jun 10 , 2024 | 08:20 AM