Varanasi: సమాజ్ వాదీ పార్టీ నేత నివాసం వద్ద కాల్పుల కలకలం
ABN, Publish Date - Jul 01 , 2024 | 05:02 PM
వారణాసిలోని సమాజ్‌వాదీ పార్టీ(Samajwadi Party) నాయకుడు, మాజీ కార్పొరేటర్ విజయ్ యాదవ్ నివాసం వద్ద ఆదివారం జరిగిన కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో ఆరేళ్ల చిన్నారి సహా ఆరుగురు గాయపడ్డారు.
వారణాసి: వారణాసిలోని సమాజ్‌వాదీ పార్టీ(Samajwadi Party) నాయకుడు, మాజీ కార్పొరేటర్ విజయ్ యాదవ్ నివాసం వద్ద ఆదివారం జరిగిన కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో ఆరేళ్ల చిన్నారి సహా ఆరుగురు గాయపడ్డారు. దశాశవమేధ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన కుటుంబాన్ని హత్య చేయడమే లక్ష్యంగా దుండగులు దాడి చేశారని విజయ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
నిందితులు అంకిత్ యాదవ్, శోభిత్ వర్మ, గోవింద్ యాదవ్, సాహిల్ యాదవ్, ఇతర గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గాయపడిన వారిలో నిర్భయ్ యాదవ్ (6), కిరణ్ యాదవ్, ఉమేష్ యాదవ్, దినేష్ యాదవ్, శుభమ్ అలియాస్ గోలు ఉన్నారు.
ప్రస్తుతం వీరంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. వారణాసి పోలీస్ కమిషనర్ మోహిత్ అగర్వాల్ దశాశవమేధ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ (SI) రాకేశ్ పాల్‌ను సస్పెండ్ చేశారు. మిగతా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, వారిపై ఉత్తరప్రదేశ్ గ్యాంగ్స్ అండ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ (నివారణ) చట్టం, జాతీయ భద్రతా చట్టం కింద చర్యలు తీసుకుంటామని డీసీపీ ప్రమోద్ కుమార్ తెలిపారు.
For Latest News and National News click here
Updated Date - Jul 01 , 2024 | 05:02 PM