Lok Sabha Polls: ఎంపీలో 6, బీహార్‌లో 4.. పైచేయి ఎవరిదంటే..?
ABN, Publish Date - Mar 20 , 2024 | 02:01 PM
తొలిదశ పోలింగ్ జరగనున్న 102 స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ స్థానాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. దీంతో మెజార్టీ స్థానాల్లో గెలపు కోసం ఎన్డీయే, ఇండియా కూటమిలు ప్రయత్నిస్తుండగా.. ప్రాంతీయ పార్టీలు సైతం తమ ప్రభావం చూపించేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ప్రధానంగా మధ్యప్రదేశ్‌లో 6, బీహార్‌లో నాలుగు స్థానాల్లో తొలిదశలో ఎన్నికలు జరగనున్నాయి.
తొలిదశ పోలింగ్ జరగనున్న 102 స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ స్థానాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. దీంతో మెజార్టీ స్థానాల్లో గెలపు కోసం ఎన్డీయే, ఇండియా కూటమిలు ప్రయత్నిస్తుండగా.. ప్రాంతీయ పార్టీలు సైతం తమ ప్రభావం చూపించేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ప్రధానంగా మధ్యప్రదేశ్‌లో 6, బీహార్‌లో నాలుగు స్థానాల్లో తొలిదశలో ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్‌లో మొత్తం 29 లోక్‌సభ స్థానాలు ఉండగా.. బీహార్‌లో 40 స్థానాలు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి 69 స్థానాలుండగా.. గత ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో ఎన్డీయే కూటమి గెలుపొందింది.
మధ్యప్రదేశ్‌లో..
మధ్యప్రదేశ్‌లో మొత్తం 29 లోక్‌సభ సీట్లు ఉండగా.. తొలిదశలో 6 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సిధి, షాహదోల్, జబల్‌పూర్, మాండ్లా, బాలాఘాట్, చింద్వారాలో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలైంది. తొలిదశ ఎన్నికలు జరగనున్న 6 స్థానాలకు గానూ 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఐదు నియోజకవర్గాలను బిజెపి గెలుచుకోగా, చింద్వారాలో కాంగ్రెస్ గెలుచుకుంది. ఈసారి ఆరు స్థానాల్లో విజయం కోసం కలమనాధులు వ్యూహం సిద్ధం చేశారు. మొదట్లో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం కమల్‌నాథ్‌ను పార్టీలో చేర్చుకోవాలని భావించినా.. బీజేపీ చివరి నిమిషంలో వెనక్కి తగ్గింది. అయితే చింద్వారాలో ప్రభావితం చూపగల నాయకులు, కమల్‌నాథ్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే నాయకులను బీజేపీ చేర్చకుంది. దీంతో చింద్వారాలోనూ గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో మెజార్టీ స్థానాలను బీజేపి దక్కించుకుంది. దీంతో ఎంపీలో క్లీన్‌స్వీప్‌పై కమలనాధులు ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.
బీహార్‌లో
బీహార్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాలకు తొలి దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఔరంగాబాద్, నవాడ, గయా, జముయి స్థానాలకు ఏప్రియల్ 19న పోలింగ్ జరగనుంది. 2019 ఎన్నికల్లో ఈ నాలుగు స్థానాల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. ఈసారి నాలుగు స్థానాలను తిరిగి గెలుచుకోవాలనే పట్టుదలతో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్జేడీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తుండగా.. బీజేపీ, జేడీయూ కలిసి పోటీకి దిగుతున్నాయి. ఈనేపథ్యంలో ఏ కూటమి బీహార్‌లో ప్రభావం చూపిస్తుందనేది వేచి చూడాల్సి ఉంది.
PM Narendra Modi: స్టార్టప్‌లలో మహిళల గురించి ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..
Updated Date - Mar 20 , 2024 | 02:02 PM