Lok Sabha Elections 2024: తొలి విడతలో 66.14 శాతం, రెండో విడతలో 66.71.. ఈసీ ఫైనల్ లెక్క
ABN , Publish Date - Apr 30 , 2024 | 08:36 PM
ఏడు విడతల లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఇంతవరకూ రెండు విడతల పోలింగ్ పూర్తికాగా, ఈ రెండు విడతల్లో పోలింగ్ శాతాన్ని అధికారికంగా భారత ఎన్నికల సంఘం మంగళవారంనాడు విడుదల చేసింది. ఏప్రిల్ 19న జరిగిన తొలి విడతలో 66.14 శాతం పోలింగ్ నమోదైనట్టు తెలిపింది. ఏప్రిల్ 26న జరిగిన రెండో విడతలో 66.71 శాతం నమోదైనట్టు వెల్లడించింది.
న్యూఢిల్లీ: ఏడు విడతల లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) భాగంగా ఇంతవరకూ రెండు విడతల పోలింగ్ పూర్తికాగా, ఈ రెండు విడతల్లో పోలింగ్ శాతాన్ని అధికారికంగా భారత ఎన్నికల సంఘం మంగళవారంనాడు విడుదల చేసింది. ఏప్రిల్ 19న జరిగిన తొలి విడతలో 66.14 శాతం పోలింగ్ నమోదైనట్టు తెలిపింది. ఏప్రిల్ 26న జరిగిన రెండో విడతలో 66.71 శాతం నమోదైనట్టు వెల్లడించింది. మొదటి విడతలో 102 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగగా, రెండో విడతలో 88 నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయింది.
Lok Sabha Elections 2024: సల్మాన్ ఖుర్షీద్ మేనకోడలిపై ఎఫ్ఐఆర్
కాగా, 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే మొదటి రెండు ఫేజ్‌లలో పోలింగ్ ఈసారి (2024) తగ్గింది. 2019లో మొదటి దశలో 69.43 శాతం, రెండో విడతలో 69.17 శాతం పోలింగ్ నమోదైంది.
Read Latest National News and Telugu News