ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Assam: అస్సాంలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన బోగీలు

ABN, Publish Date - Oct 18 , 2024 | 09:49 AM

అస్సాంలో రైలు ప్రమాదం జరిగింది. అగర్తల-లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 8 బోగీలు పట్టాలు తప్పాయి. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ముంబై వెళ్లే లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ అగర్తల నుంచి గురువారం ఉదయం బయలుదేరింది. అయితే..

అస్సాంలో రైలు ప్రమాదం జరిగింది. అగర్తల-లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 8 బోగీలు పట్టాలు తప్పాయి. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ముంబై వెళ్లే లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ అగర్తల నుంచి గురువారం ఉదయం బయలుదేరింది. అయితే మధ్యాహ్నం 3.45 గంటల ప్రాంతంలో లండింగ్ డివిజన్ లుమ్‌డింగ్- బర్దర్‌పూర్ హిల్ సెక్షన్ పరిధి అస్సాంలోని డిబాలాంగ్ స్టేషన్ దగ్గర పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు.


రైలింజన్‌తో సహా మొత్తం ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయని వివరించారు. ఈ ఘటనలో ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. తాజాగా తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మైసూరు-దర్బంగా బాగమతి ఎక్స్‌ప్రెస్ రైలు శుక్రవారం రాత్రి చెన్నై సమీపంలోని కవరైప్పెట్టై రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న గూడ్స్ రైలు ఢీకొని పట్టాలు తప్పింది. అయితే ఈ ఘటనలో కూడా అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగకపోవడమంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి సిగ్నల్, రూట్ మధ్య మిస్ మ్యాచ్ అవడమే కారణమని రైల్వే అధికారులు తెలిపారు. ఇదిలావుండగా ఇటీవల వరుసగా చోటు చేసుకుంటున్న రైలు ప్రమాదాలతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Updated Date - Oct 18 , 2024 | 09:58 AM