Bengaluru: బెంగళూరులో తక్కువ ఎత్తులో చక్కర్లు కొట్టిన భారీ విమానం
ABN, Publish Date - Apr 04 , 2024 | 04:06 PM
బెంగళూరులో గల హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎయిర్ పోర్టుపై బోయింగ్ విమానం ఇటీవల ఆరుసార్లు చక్కర్లు కొట్టి వెళ్లింది. ఆ భారీ విమానం వచ్చి, వెళ్లే దృశ్యాలను స్థానికులు ఫొటోలు, వీడియోలు తీశారు. మరికొందరు వాటిని సోషల్ మీడియా ఎక్స్‌లో షేర్ చేశారు.
బెంగళూర్: దేశవ్యాప్తంగా ఎన్నికల కోలాహలం నడుస్తోంది. ప్రచారం, నేతల స్పీచ్, సౌండ్ సిస్టమ్ వల్ల కొందరు ఇబ్బంది పడుతున్నారు. బెంగళూర్ (Bengaluru) లాంటి నగరాల్లో మాత్రం ప్రచారాన్ని అంతగా పట్టించుకోరు. కొరమంగళ ప్రాంత వాసులను మాత్రం ఓ విమానం (Flight) ఇబ్బందికి గురిచేస్తోంది. భారీ విమానం తరచూ చక్కర్లు కొట్టడం, తక్కువ ఎత్తు నుంచి ప్రయాణించడంతో స్థానికులు ఆందోళన చెందారు.
ఏం జరిగిందంటే..?
హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎయిర్ పోర్టుపై బోయింగ్ విమానం ఇటీవల ఆరుసార్లు చక్కర్లు కొట్టి వెళ్లింది. ఆ భారీ విమానం వచ్చి, వెళ్లే దృశ్యాలను స్థానికులు ఫొటోలు, వీడియోలు తీశారు. మరికొందరు వాటిని సోషల్ మీడియా ఎక్స్‌లో షేర్ చేశారు. కే 7067 నంబర్ గల బోయింగ్ 777-337 విమానం అని తెలుస్తోంది. ఆ భారీ విమానాన్ని ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఇతర వీవీఐపీల కోసం మాత్రమే ఉపయోగిస్తారు. ఆ విమానాన్ని ఎవరు ఉపయోగించారనే సందేహం నెలకొంది.
రెండు విమానాలు
బోయింగ్ 777-337 లాంటి విమానాలు కేంద్ర ప్రభుత్వం వద్ద రెండు ఉన్నాయి. బోయింగ్ విమానం ఢిల్లీ నుంచి బెంగళూర్ వచ్చి వెళ్లిందని తర్వాత తెలిసింది. ఇందిరానగర్‌పై కూడా చక్కర్లు కొట్టిందని ఓ యూజర్ పోస్ట్ చేశాడు. తక్కువ ఎత్తులో విమానం రోజు వస్తుందని మరొకరు రాశారు. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ విమానాన్ని ప్రధాని, రాష్ట్రపతి వాడటం లేదు. ఆ విమానం కండీషన్ చెక్ చేసేందుకు, లేదంటే పైలట్లకు శిక్షణ కోసం బోయింగ్ విమానాన్ని తిప్పినట్టు తేలింది. దాంతో కోరమంగళ, ఇందిరానగర్ ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
Borewell: 20 గంటల తర్వాత సురక్షితంగా బయటకు రెండేళ్ల బాలుడు
Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు ఊరట.. వ్యక్తిగత నిర్ణయమంటూ ఆ పిటిషన్ తిరస్కరణ
Chief Minister: ప్రధానిని చేస్తామన్నా నేను బీజేపీవైపు వెళ్లను..
మరిన్ని జాతీయ వార్తల కోసం
Updated Date - Apr 04 , 2024 | 04:08 PM