Schools Closed: జూన్ 8 వరకు అన్ని స్కూల్స్ బంద్..కారణమిదే
ABN, Publish Date - May 30 , 2024 | 07:47 AM
గత రెండు రోజులుగా భారతదేశం అంతటా తీవ్రమైన ఎండ వేడిగాలులు(heatwave) విధ్వంసం సృష్టిస్తున్నాయి. ప్రధానంగా ఢిల్లీ(delhi), బిహార్(bihar) సహా పలు ప్రాంతాల్లో 50కి మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
గత రెండు రోజులుగా భారతదేశం అంతటా తీవ్రమైన ఎండ వేడిగాలులు(heatwave) విధ్వంసం సృష్టిస్తున్నాయి. ప్రధానంగా ఢిల్లీ(delhi), బిహార్(bihar) సహా పలు ప్రాంతాల్లో 50కి మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలుల నేపథ్యంలో ఇప్పటికే 337 మంది పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం క్షీణించగా, 10 మందికిపైగా మృత్యువాత చెందారు. ఈ పరిస్థితి మరికొన్ని రోజులు ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ నేపథ్యంలో విపరీతమైన వేడిని దృష్టిలో ఉంచుకుని బీహార్(bihar)లోని అన్ని పాఠశాలలను మూసివేయాలని(Schools Closed) ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలతో పాటు, అంగన్‌వాడీ, కోచింగ్ సెంటర్లు కూడా మే 30 నుంచి జూన్ 8 వరకు మూసివేయాలని ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమైన ఇతర చర్యలను నిర్ధారించాలని ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. విపరీతమైన వేడిగాలుల కారణంగా అనేక మంది విద్యార్థులు స్పృహతప్పి పడిపోయారనే వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
దీంతోపాటు అన్ని జిల్లాల్లో విపరీతమైన వేడిగాలుల(heatwave) నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో పాటు డివిజనల్ కమిషనర్లు, జిల్లా మేజిస్ట్రేట్‌లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అవసరమైన మార్గదర్శకాలను జారీ చేశారు. రాష్ట్రంలోని చాలా జిల్లాలు గత కొన్ని రోజులుగా తీవ్రమైన వేడిగాలుల ప్రభావానికి గురయ్యాయి. ప్రధానంగా గయా, ఔరంగాబాద్, కైమూర్‌లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇది కూడా చదవండి:
Loksabha election 2024: లోక్‌సభ ఎన్నికల ఏడో దశ ప్రచారం నేడే లాస్ట్
Investment Plan: 10 ఏళ్లలో టాప్ 5 ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ వచ్చాయంటే
CIBIL Score: సిబిల్ స్కోర్ ఎక్కువ సార్లు చెక్ చేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు
For More National News and Telugu News..
Updated Date - May 30 , 2024 | 07:49 AM