ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi Polls: పొత్తు పొరపాటే... ఢిల్లీ కాంగ్రెస్ కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Dec 25 , 2024 | 07:42 PM

ఆప్ ప్రభుత్వంపై బుధవారంనాడిక్కడ 'మౌకా మౌకా, హర్ బార్ ధోకా' శీర్షికన 12 పాయింట్లతో కూడిన శ్వేతపత్రాన్ని అజయ్ మాకెన్, తదితర కాంగ్రెస్ నేతలు విడుదల చేశారు.

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)తో గతంలో ఢిల్లీలో పొత్తు పెట్టుకోవడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏఐసీసీ కోశాధికారి అజయ్ మాకెన్ (Ajay Maken) కీలక వ్యాఖ్యలు చేశారు. 2013లో 40 రోజుల పాటు ఆప్‌కు కాంగ్రెస్ మద్దతివ్వడం కాంగ్రెస్ చేసిన తప్పని, దీని వల్ల కాంగ్రెస్ బలహీనపడిందని, ఆ పొరపాటును ఇప్పటికైనా సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఢిల్లీని లండన్ చేస్తామని వాగ్దానం చేసిన ఆప్ ఢిల్లీని దేశంలోనే అతిపెద్ద వాయుకాలుష్య రాజధానిగా మార్చిందని విమర్శించారు. ఆప్ ప్రభుత్వంపై బుధవారంనాడిక్కడ 'మౌకా మౌకా, హర్ బార్ ధోకా' శీర్షికన 12 పాయింట్లతో కూడిన శ్వేతపత్రాన్ని అజయ్ మాకెన్, తదితర కాంగ్రెస్ నేతలు విడుదల చేశారు.

Delhi Polls: 'ఓటుకు నోటు' ఆరోపణ చేసిన ఆప్, తోసిపుచ్చిన బీజేపీ


అనంతరం మీడియాతో మాకెన్ మాట్లాడుతూ, జన్‌లోక్‌పాల్ ఆందోళనతో కేజ్రీవాల్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, కానీ అవినీతి నిరోధక అంబుడ్స్‌మన్‌ను ఏర్పాటు చేయడంలో విఫలమైందని అన్నారు. ''దేశంలోనే అవినీతికి కింగ్ కేజ్రీవాల్. ఆకారణంగానే మేము కేజ్రీవాల్ ప్రభుత్వంపైన, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైన శ్వేతపత్రంతో వచ్చాం'' అని చెప్పారు.


కనీసం పంజాబ్‌‌లోనైనా జన్‌లోక్‌పాల్ ఎందుకు ఏర్పాటు చేయలేదని మాకెన్ ప్రశ్నించారు. "ఢిల్లీలో జన్‌లోక్‌పాల్‌ను ఎల్జీ అనుమతించలేదని అనుకుంటే పంజాబ్‌లో తెచ్చి ఉండాల్సింది. మిమ్మల్ని అడ్డుకున్నదెవరు? అక్కడ మీకు పూర్తిస్థాయి ప్రభుత్వం ఉంది. పదేళ్ల క్రితం జన్‌లోక్‌పాల్ పేరుతో ఆ పార్టీ (ఆప్) ఏర్పడింది. ఇప్పుడు దాన్ని మరిచిపోయారు" అని మాకెన్ విమర్శించారు. కోవిడ్‌-19తో జనం చనిపోతుంటే ఆప్ ప్రభుత్వం సీఎం నివాసం "శీష్ మహల్" నిర్మాణం కోసం నిధులు మళ్లించిందని తప్పుపట్టారు.


ఇది కూడా చదవండి..

Karnataka: రోడ్డుకు సీఎం పేరు.. మండిపడిన విపక్షాలు

Bengaluru: రేణుకాస్వామి హత్య కేసులో మరో ఐదుగురికి బెయిల్‌

For National News And Telugu News

Updated Date - Dec 25 , 2024 | 07:42 PM