ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AAP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగాబరిలోకి..!!

ABN, Publish Date - Jun 07 , 2024 | 08:12 AM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ఆమ్ ఆద్మీ పార్టీ కీలక ప్రకటన చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులకు తావులేదని స్పష్టం చేసింది. తమ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతుందని తేల్చి చెప్పింది. ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆ పార్టీ ముఖ్యనేతలు గురువారం సమావేశం అయ్యారు.

AAP

ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కీలక ప్రకటన చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులకు తావులేదని స్పష్టం చేసింది. తమ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతుందని తేల్చి చెప్పింది. ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆ పార్టీ ముఖ్యనేతలు గురువారం సమావేశం అయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేశామని, అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతామని ఆప్ ఢిల్లీ కన్వీనర్ గోపాల్ రాయ్ ప్రకటించారు.


దేశంలో నియంతృత్వానికి తెరదించేందుకు ఇండియా బ్లాక్‌తో కలిసి లోక్ సభలో పోటీ చేశామని గోపాల్ రాయ్ వివరించారు. ఆ తర్వాత పొత్తులకు అవకాశం లేదని వెల్లడించారు. లోక్ సభ ఎన్నికల్లో ప్రజా తీర్పును శిరసావహిస్తామని ప్రకటించారు. లోక్ సభ ఎన్నికలు తమ పార్టీకి కీలకంగా మారాయని వివరించారు. పార్టీ అధినేత కేజ్రీవాల్ అరెస్ట్ చేయడం ప్రభావం చూపిందని పేర్కొన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీతో కలిసి బీజేపీ ఓటు బ్యాంక్‌ను కొల్లగొట్టామని స్పష్టం చేశారు. ఈ ఏడాది ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న క్రమంలో ఆప్ కీలక ప్రకటన చేసింది. ఢిల్లీ అసెంబ్లీకి ఆప్ వరసగా మూడుసార్లు గెలుపొందిన సంగతి తెలిసిందే.

Updated Date - Jun 07 , 2024 | 08:12 AM

Advertising
Advertising