Election Commission : జమ్మూకశ్మీర్‌లో ఓటర్ల జాబితా సవరణ
ABN, Publish Date - Jun 22 , 2024 | 03:23 AM
హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలను మొదలు పెట్టామని ఎన్నికల సంఘం ప్రకటించింది.
న్యూఢిల్లీ, జూన్ 21: హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలను మొదలు పెట్టామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆయా రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాను సవరించనున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. జూలై 1వ తేదీ వరకూ ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులకు అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. హరియాణా, మహారాష్ట్రల ప్రస్తుత అసెంబ్లీ కాల పరిమితి నవంబరు 3, 25 వరకూ ఉంది. జార్ఖండ్ అసెంబ్లీ కాల పరిమితి జనవరి 5, 2025 వరకూ ఉంది. జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన తరువాత కొత్త అసెంబ్లీని ఏర్పాటు చేయాల్సి ఉంది. కాగా, కేంద్ర ప్రభుత్వం 2019, అగస్టులో ఆర్టికల్ 370ని రద్దు చేసి, జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించింది. ఆ ప్రక్రియ తరువాత జరగబోయే ఈ ఎన్నికలు ఆ రాష్ట్రానికి తొలి ఎన్నికలు అవుతాయి.
Updated Date - Jun 22 , 2024 | 06:56 AM