ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఝార్ఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి!

ABN, Publish Date - Nov 04 , 2024 | 02:52 AM

ఝార్ఖండ్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు.

  • గిరిజనులకు మినహాయింపు: అమిత్‌ షా

  • 5 లక్షల ఉద్యోగాలు.. 500కే సిలిండర్‌

  • మహిళలకు ప్రతినెలా రూ.2,100

  • బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

న్యూఢిల్లీ, నవంబరు 3: ఝార్ఖండ్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు. ఈనెలలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్న ఝార్ఖండ్‌లో ‘సంకల్ప పత్ర’ పేరిట బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను ఆదివారం ఆయన విడుదల చేశారు. కేంద్రమంత్రులు శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, సంజయ్‌ సేథ్‌, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో అమిత్‌షా మాట్లాడుతూ ఝార్ఖండ్‌ భవిష్యత్తుకు ఈ ఎన్నికలే కీలకమన్నారు. పూర్తి అవినీతి ప్రభుత్వం కావాలో లేక, మోదీ నాయకత్వంలో అభివృద్ధి మార్గంలో పయనించే బీజేపీ ప్రభుత్వం కావాలో ఝార్ఖండ్‌ ప్రజలు నిర్ణయించుకోవాలని సూచించారు. ఝార్ఖండ్‌కు గుర్తింపు, చొరబాటుదారుల నుంచి భూమి, మహిళల రక్షణ బీజేపీ లక్ష్యమని చెప్పారు. ఝార్ఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామని, అయితే, దాని నుంచి గిరిజనులకు మినహాయింపు ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

2.87 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు సహా మొత్తం 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. రూ.500కే వంటగ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామని, దీపావళి, రాఖీ పండుగలకు పూర్తి ఉచితంగా 2 గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామని పేర్కొన్నారు. గోగో దీదీ స్కీం కింద మహిళలకు నెలకు రూ.2,100 ఇస్తామని తెలిపారు. పరిశ్రమలు, మైనింగ్‌ వల్ల నిర్వాసితులైనవారి పునరావాసానికి ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.


  • చొరబాటుదారుల్ని తలకిందులుగా వేలాడదీస్తాం

మహిళలను వేధిస్తున్న చొరబాటుదారులను తలకిందులుగా వేలాడదీస్తామని అమిత్‌షా హెచ్చరించారు. ఝార్ఖండ్‌లో హేమంత్‌ సోరెన్‌ ప్రభుత్వం చొరబాటుదారులకు ఆశ్రయం కల్పించడం ద్వారా గిరిజనుల భద్రతపై రాజీ పడిందని విమర్శించారు. చొరబాటుదారులను ఓటుబ్యాంకుగా చూస్తోందని నిందించారు. చొరబాటుదారుల వల్ల రాష్ట్రంలో గిరిజన జనాభా తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘చొరబాటుదారులు మన కుమార్తెలకు వలవేసి, వారిని పెళ్లి చేసుకొని ఇక్కడి భూమిని ఆక్రమిస్తున్నారు. దీన్ని ఆపకపోతే ఝార్ఖండ్‌కు భద్రత ఉండదు. ఝార్ఖండ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతోంది. ఈ చొరబాటుదారులందరినీ మేం ఏరిపారేస్తాం. అసోంలోని బీజేపీ ప్రభుత్వం చొరబాట్లను ఆపేసింది. ఇక్కడ కూడా అదే నిబద్ధతతో రోటీ, బేటీ(కుమార్తె), మాటీ(భూమి)ని పరిరక్షిస్తాం’ అని అమిత్‌షా స్పష్టం చేశారు.

Updated Date - Nov 04 , 2024 | 02:53 AM