Ambedkar Row: ఆయన్ని 'పిచ్చి కుక్క' కరిచింది: ప్రియాంక్ ఖర్గే
ABN, Publish Date - Dec 21 , 2024 | 06:16 PM
అంబేడ్కర్, సమానత్వం అనేవి ఆయన (అమిత్‌షా) ఆలోచనల్లో కూడా లేవని, ఆయన సిద్ధాంతం, భావజాలం నుంచి ఇవి కనుమరుగయ్యాయని ప్రియాంక్ ఖర్గే విమర్శించారు.
కలబురగి: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar)పై కేంద్ర మంత్రి అమిత్‌షా (Amit Shah) చేసిన వ్యాఖ్యల వివాదం ఇప్పుడిప్పుడే చల్లారేలా కనిపిచడం లేదు. తాజాగా అమిత్‌షాపై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే (Priyank Kharge) సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఆయనను పిచ్చికుక్క (Rabid dog) కరిచినట్టుంది'' అని మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
Amit Shah Ambedkar Remarks Row: అమిత్‌షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసన 24న
"ఏడు జన్మల్లో నేను భగవంతుడి నామజపం చేస్తే స్వర్గం వస్తుందో లేదో నాకు తెలియదు. ఈ జన్మలో అంబేడ్కర్ నామం జపిస్తే మాత్రం మాకు రాజకీయ, సామాజిక, ఆర్థిక సమానత్వం, గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది" అని ఖర్గే అన్నారు. అంబేడ్కర్, సమానత్వం అనేవి ఆయన (అమిత్‌షా) ఆలోచనల్లో కూడా లేవని, ఆయన సిద్ధాంతం, భావజాలం నుంచి ఇవి కనుమరుగయ్యాయని విమర్శించారు. అంబేడ్కర్, బసవ ఫిలాసఫీ పెరిగే కొద్దీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంత భావజాలం తగ్గుముఖం పడుతుందని ప్రియాంక్ ఖర్గే అన్నారు.
అమిత్‌షా ఏమన్నారు?
ఈనెల 20వ తేదీతో పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా కేంద్ర మంత్రి అమిత్‌షా డిసెంబర్ 18న రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అంబేద్కర్ పేరును పదేపదే ప్రస్తావించడం కాంగ్రెస్‌కు ఒక ఫ్యాషన్‌గా మారిందని షా విమర్శించారు. దేవుడి పేరు పదేపదే వల్లె వేస్తే స్వర్గమైనా దొరుకుతుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, అంబేద్కర్‌ను అమమానించినందుకు అమిత్‌షా క్షమాపణ చెప్పాలని, తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. పార్లమెంటు వెలుపల వినూత్న రీతిలో రోజువారీ నిరసనలకు దిగింది. అయితే, తన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించిందని, ఎడిట్ వెర్షన్లతో తప్పుదారి పట్టించిందని అమిత్‌షా వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీనే అంబేద్కర్ వ్యతిరేక, రిజర్వేషన్ వ్యతిరేక పార్టీ అని అన్నారు.
ఇవి కూాడా చదవండి..
Bangalore: బెంగళూరులో అమెరికా రాయబారి కార్యాలయం..
Chief Minister: ప్రజాదరణ చూసి ఓర్వలేకే మాపై విమర్శలు.. దమ్ముంటే కేంద్రంపై మీ సత్తా ప్రదర్శించండి
Read More National News and Latest Telugu News
Updated Date - Dec 21 , 2024 | 06:17 PM